Vettaiyan : దసరా కానుకగా అభిమానుల్ని అలరించడానికి సిద్ధమవుతున్న సినిమాల్లో ‘వేట్టైయన్‌’ ఒకటి. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ఈ చిత్రాన్ని జై భీమ్ ఫేమ్ టి.జె.జ్ఞానవేల్ తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించింది. రజనీకాంత్‌తో పాటు బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్, తెలుగు సినిమా హీరో రానా, మలయాళం సూపర్ స్టార్ ఫహాద్ ఫాజిల్ ఇంకా టాలెంటెండ్ యాక్ట్రెస్ మంజువారియర్‌ కీలక పాత్రలు పోషించారు. తెలుగులో ఈ సినిమాను వేటగాడు గా విడుదల చేయాలనే ఆలోచనతో ఉన్నారు మేకర్స్.

ఈ చిత్రం అక్టోబర్ 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. లేటెస్ట్ గా ఈ చిత్రం నుంచి మొదటి గీతం విడుదలైంది. రజనీకాంత్ పాత్ర పరిచయంతో వచ్చే ఈ మాస్ సాంగ్ ప్రేక్షకులను ఉర్రూతల చేయడం ఖాయం. ‘ఆట కొచ్చిండే.. నాటు బీటై వచ్చిండే.. వేట కత్తై వచ్చిండే.. వేట కొచ్చిండే’ అంటూ సాగే ఈ పాటకు అనిరుధ్ రవిచందర్ స్వరాలు అందించారు. శ్రీనివాస మౌళి సాహిత్యం అందించగా, నకాష్ అజిజ్, అరుణ్ కౌండిన్య, దీప్తి సురేష్‌ కలిసి ఆలపించారు.

ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కింది. రజనీకాంత్ ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారో తెలియాలంటే అక్టోబర్ 10 వరకు ఆగాల్సిందే. అమితాబ్ బచ్చన్, రానా, ఫహాద్ ఫాజిల్ వంటి స్టార్ కాస్ట్‌తో తెరకెక్కిన ‘వేటయాన్‌’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా దసరా బరిలో బ్లాక్ బస్టర్‌గా నిలుస్తుందా లేదా అన్నది చూడాలి.

Leave a comment

error: Content is protected !!