Venky – Anilravipudi movie : “ఎఫ్2”, “ఎఫ్3” చిత్రాల తర్వాత వెంకటేష్, అనిల్ రావిపూడి మళ్లీ కలిసి ఒక సినిమా చేస్తున్నారనే సంగతి తెలిసిందే. ఈ హ్యాట్రిక్ చిత్రానికి శిరీష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. “SVC 58” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం ఇప్పుడు రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించింది.

ఈ విషయాన్ని చిత్ర బృందం గురువారం అధికారికంగా ప్రకటించింది. ఒక మేకింగ్ వీడియోను కూడా విడుదల చేసింది. హైదరాబాద్ లోని ఒక ప్యాలెస్ లో మీనాక్షి, నరేష్, వీటీ గణేష్ తదితర ప్రధాన నటులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు ఈ వీడియోలో చూపించారు. వెంకటేష్ త్వరలోనే ఈ చిత్ర సెట్లోకి జాయిన్ అవుతారని చిత్ర వర్గాలు తెలిపాయి.

ఈ చిత్రం ఒక క్రైమ్ కామెడీ గా రూపొందుతోంది. హీరో, అతని అందమైన భార్య, మాజీ ప్రియురాలి మధ్య జరిగే ఆసక్తికరమైన కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది. వెంకటేష్ ఈ చిత్రంలో మాజీ పోలీసు అధికారి పాత్రలో నటిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం, సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a comment

error: Content is protected !!