Venky – Anil Combo : విక్టరీ వెంకటేశ్ కథానాయకుడిగా, కామెడీ ఎంటర్ టైనర్స్ దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో మరో సినిమా వస్తోంది. ‘ఎఫ్2’, ‘ఎఫ్3’ చిత్రాల తర్వాత వెంకటేశ్, అనిల్ రావిపూడి, దిల్ రాజు కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ మూడో చిత్రంలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. ముఖ్యపాత్రల్లో రాజేంద్రప్రసాద్, సాయికుమార్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఇప్పటికే చిత్రీకరణ 90శాతం పూర్తయ్యింది. నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో తాజాగా డబ్బింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ విషయాన్ని చిత్రబృందం ఆదివారం ప్రకటించింది. త్వరలోనే టైటిల్, ఫస్ట్‌లుక్ విడుదల చేయాలని భావిస్తున్నారని సమాచారం. ముక్కోణపు క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో వెంకటేశ్ ఓ మాజీ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.