Venky – Anil combo : “ఎఫ్2”, “ఎఫ్3” తర్వాత వెంకటేష్, అనిల్ రావిపూడిల కలయికలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘సంక్రాతికి వస్తున్నాం’ అనే టైటిల్ ఖరారు చేశారని అప్పట్లో వార్తలొచ్చాయి. ఇందులో వెంకటేష్‌కు జోడిగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, సాయికుమార్, విటి గణేశ్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించనున్నారు.

ఇటీవలే హైదరాబాద్‌లో తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్‌ ఆగస్టు 9 నుంచి పొల్లాచ్చిలో ప్రారంభం కానుంది. దాదాపు నెల పాటు జరగనున్న ఈ షెడ్యూల్‌లో వెంకటేశ్‌తో సహా చిత్రంలోని ప్రధాన తారాగణం అందరూ పాల్గొంటారు.  ఒక మాజీ ప్రేయసి, అందమైన భార్య మధ్య చిక్కుకున్న ఒక వ్యక్తి కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. ట్రయాంగిల్ క్రైమ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంగీతం భీమ్స్ సిసిరోలియో, ఎడిటింగ్ శ్రీకర్ ప్రసాద్, కెమెరా రామ్‌ప్రసాద్ రావు అందించనున్నారు.

Leave a comment

error: Content is protected !!