Venky – Anil Combo : విక్టరీ వెంకటేష్, విక్టరీ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడవ సినిమా ప్రస్తుతం శరవేగంతో షూటింగ్ జరుపుకుంటోంది. దిల్‌రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి మరియు ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. గత నెల రెండవ వారం నుండి పొల్లాచిలో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం తాజాగా ఈ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది.

ఈ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలతో పాటు రెండు పాటలు చిత్రీకరించబడ్డాయి.ఈ చిత్రం తన కొత్త షెడ్యూల్‌ను ఈ నెలలోనే హైదరాబాద్‌లో ప్రారంభించనుంది. ముక్కోణపు క్రైమ్ డ్రామా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకటేష్ మాజీ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా కోసం ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే పేరు పరిశీలనలో ఉంది. వెంకటేష్ మరియు అనిల్ రావిపూడిల కలయిక, క్రైమ్ డ్రామా కథాంశం మరియు సంక్రాంతి విడుదల తేదీ ఈ సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పాయి.

Leave a comment

error: Content is protected !!