నటీనటులు: మీనా, నదియ, నరేష్, కృతిక, ఈస్తర్ అనిల్, సంపత్ రాజ్, పూర్ణ తదితరులు
దర్శకుడు: జీతూ జోసెఫ్
నిర్మాతలు: డి సురేష్ బాబు, ఆంటోని పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి
బ్యానర్: సురేష్ ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్, రాజ్ కుమార్ థియేటర్స్
సంగీతం : అనూప్ రూబెన్స్
కెమెరామెన్: సతీష్ కురూప్
పీఆర్వో: వంశీ-శేఖర్
హిట్టైన ప్రతి సినిమాని సీక్వెల్ ఎక్స్పెక్ట్ చేయలేం. ఐతే కొన్ని చిత్రాలకి మాత్రం సీక్వెల్ ఉంటే బాగుంటుందనిపిస్తుంది. అలాంటి చిత్రమే దృశ్యం. ఈ చిత్రానికి సీక్వెల్ వస్తోందంటే సినీ లవర్సే కాదు కామన్ ఆడియన్స్ వెయట్ చేసేంత ఇంప్యాక్ట్ క్రియేట్ చేసిందీ ఈ చిత్రం. ఐతే ఈ సినిమా కి సీక్వెల్ ఈ ఇయర్ మలయాళం లో రావడం బ్లాక్ బస్టర్ హిట్టవడం జరిగిపోయాయి. దృశ్యం సినిమా తో వచ్చి హిట్టు కొట్టిన వెంకటేష్ దృశ్యం 2 తో ఆడియన్స్ ముందుకొచ్చారు. ఈ నెల 25 అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా రిలీజయ్యైంది . మరి ఈ సినిమా హిట్టా ఫట్టా అనేది ఈ రివ్యూ లో చూసేద్దాం.
కథ : ఆరేళ్ళ తరువాత సీక్వల్ కథ మొదలవుతుంది. అప్పటికి రాంబాబు ( వెంకటేష్ ) డబ్బులు బాగానే సంపాదిస్తాడు. పట్టణంలో సినిమా హాలు కడతాడు. ఓ సినిమా కూడ తీయాలని ఓ ప్రసిధ్ధ రచయిత వినయ్ చంద్ర ( తణికెళ్ళ భరణి ) తో స్టోరీ సిట్టింగులు వేస్తుంటాడు. ఈ ఆరేళ్ళుగా రాంబాబు కుటుంబం కూడ సంతోషంగా ఏమీ వుండదు. భయం గుప్పెట్లో బతుకుతుంటారు. పోలీసు సైరన్ వినిపించినా, పోలీసు కనిపించినా ఉలిక్కి పడుతుంటుంది. పెద్ద కూతురికి తరచూ ఫిట్స్ వస్తుంటాయి. రాంబాబు పెరుగుదలను చూసి అసూయపడేవారు తరచూ ఆ హత్య గురించే గుసగుసలాడుతుంటారు. పోలీసులు ప్రకటించిన నగదు బహుమతికి ఆశపడిన ఓ దొంగ వరుణ్ శవాన్ని రాంబాబు పోలీస్ స్టేషన్ లో పాతిపెట్టినట్టు చెప్పడంతో కేసును మళ్ళీ తెరుస్తారు. మళ్ళీ రాంబాబు తన సినిమా పరిజ్ఞానంతో కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడా లేక తప్పొప్పుకొని జైలు కెళ్ళాడా లేకా ఇందులోంచి కూడ తెలివి గా బయటపడ్డాడా అనేది అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే .
కథనం : ఈ సినిమా కి ఒరిజినల్ మళయాళం లో తీసిన జీతు జోసెఫ్ డైరెక్టర్ అవ్వడం పెద్ద ప్లస్ పాయింట్. మలయాళం వర్షన్ కి తెలుగు వర్షన్ తో పోల్చితే కొన్ని సీన్స్ లో కొంచెం డ్రాం ని పెంచి కొన్ని కొన్ని చిన్న చిన్న మార్పులు చేసారే తప్ప మిగతాదంతా సేం టూ సేం. ఫైనల్ గా ప్రజెంటేషన్‌లో మార్పులు చేశారే తప్ప భారీ మార్పులైతే చేయలేదు. తెలుగు ఆడియన్స్ కి నచ్చే విధంగా వెంకటేష్ ఇమేజ్ ని దృష్టి లో పెట్టుకొని చాల జాగ్రత్త గా తీసి హిట్టు కొట్టారు చిత్ర యూనిట్. సినిమా కి ప్రాణం లాస్ట్ 30 నిమిషాలు. ఆ లాస్ట్ ఫార్ట్ కి జీతూ జోసెఫ్ సినిమా కి ఇచ్చిన ట్రీట్ మెంట్ , ఫైనల్ ట్విస్ట్ మూవికే హైలెట్. ఐతే మలయాళం లో బ్లాస్ట్ ఐన కొన్ని సీన్స్ తెలుగు లో అంతగా పేలలేదనే చెప్పాలి. ఎస్పెషల్లి కోర్ట్ సీన్స్ . ఇక కొన్ని పాత్రల విషయం లోను కొంచెం శ్రద్ద తీసుకొని ఉంటే ఇంకా బాగుండేదేమో. ఇంతటి ఘోరమైన నేరం జరిగినా, మనం ఇంతపెద్ద హోదాల్లో వున్నా అతన్ని శిక్షించలేకపోయాం అంటుంది మాజీ ఐజి ( నదియా ) . “ఆ కుటుంబం గత ఆరేళ్ళుగా తమ నేరం బయటపడుతుందనే భయంలో బతికింది. ఇకముందూ అలాటి భయంలోనే బతుకుతుంది. అంతకన్నా శిక్ష ఏముంటుంది వాళ్లకు?” అని కొత్త ఐజి కొత్త ఐజీ చెప్పడంతో సినిమా ముగుస్తుంది. ఈ డైలాగ్ రాంబాబు కుటుంబం పడుతున్న మానసిక క్షోభని తెలియజేస్తుంది.
నటీ నటుల పెర్ఫార్మెన్స్ –
ఫ్యామిలీ కోసం ఏదైనా చేస్తాడు రాంబాబు. అది తప్పా.. ఒప్పా అని ఆలోచించడు. తన ఫ్యామిలీని కాపాడుకోవడమే రాం బాబు ముఖ్య ఉద్దేశ్యం. అలాంటి పాత్రలో వెంకటేష్ ఒదిగిపొయారు. అంతే కాదు పరిణితి చెందిన క్లాసిక్ క్రిమినల్ లా రాంబాబు పాత్రలో వెంకటేష్ చాల సటిల్ గా సినిమా మొత్తం యాక్ట్ చేసారు. కొన్ని సీన్స్ లో ఐతే ఏడిపించేసారు. ఇక నదియా కూడ తనదైన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈ సినిమా లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మరో పాత్ర సంపత్ రాజ్. తన ప్రీవియస్ చిత్రాల్లో లాగా ఓన్లీ గట్టిగా అరిచి డైలాగ్స్ చెప్పే పాత్ర లా కాకుండా ఓ ప్రామిసింగ్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు. ఇక మీనా, నరేష్, కృతిక, ఈస్తర్ అనిల్,పూర్ణ తమ పాత్రల మేరకు నటించి నటించి మెప్పించారు. ఇక సత్యం రాజేష్ మంచి స్కోప్ పాత్రలో నటించారు . పూర్ణ లాయర్ లా కనిపిస్తుంది.
సాంకేతిక వర్గం : ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ మ్యూజిక్, ఇందులో పాటలు తక్కువ ఉన్నదే ఓ పాట అది కూడ సాడ్ సాంగ్ ఐతే దృశ్యం లో హిట్టైన పాట రేంజ్ లో ఈ పాట హిట్టవ్వలేదనే చెప్పాలి. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ పరవాలేదనిపిస్తుంది. ఇక కెమెరామెన్ సతీష్ కురూప్ , ఎడిటర్ మార్తాండ్ వెంకటేష్ ఎప్పటి లాగే ఒకే తమ వర్క్ తో మెప్పించారు.
బోటం లైన్ – ట్విస్ట్ లు అదిరాయి
రేటింగ్ : 3.5/5
గమనిక : ఈ రివ్యూ క్రిటిక్ అభిప్రాయం మాత్రమే