‘సృష్టి డాంగే’ హీరోయిన్ గా ఎం ఏ చౌదరి దర్శకత్వంలో కె. కోటేశ్వరరావు నిర్మించిన చిత్రం “వీరఖడ్గం`. ఈ చిత్రం మార్చి మూడో వారంలో విడుదలకు సిద్ధం. 300 ఏళ్ల క్రితం ‘పార్వతిపురంలో’ జరిగిన ఓ ‘యథార్థ’ సంఘటన ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. చరిత్ర శిథలమైనా దాని మూలాలు మిగిలే ఉంటాయి. అదే విధంగా మనిషి పగ కూడా అంతే, ఒక మనిషిని నాశనం చెయ్యాలి అనుకుంటే ఎన్ని జన్మలైనా, దాన్ని సాధించే వరకు చచ్చి శవమై కూడ అది వెంటాడుతుంటుంది. వాస్తవాన్ని వెంటాడుతూ గతం చేసిన యుద్ధమే ఈ ‘వీరఖడ్గం’. ఈ చిత్రం యూనిట్ నిర్మాత కోటేశ్వరరావు , లైన్ ప్రొడ్యూసర్ సునీల్ కుమార్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను గ్రాండ్ గా నిర్మించారు. గ్రాఫిక్స్ కి ఎంతో ప్రాధాన్యత ఉన్న చిత్రమిది. షాయక్ పర్వేజ్ మంచి సంగీతాన్ని సమకూర్చాడు. సునీత, లలిత సాగరి, సాహితి, రామకృష్ణ పాటలు పాడారు.
గతంలో నిర్మాత `రెండో కృష్ణుడు` ఆ తర్వాత ఎం ఏ చౌదరి దర్శకత్వంలో వచ్చిన `ఇంద్రాణి, చిలిపికృష్ణుడు చిత్రాలకు ఫైనాన్సియర్ గా చేసారు. ఇప్పుడు `వీరఖడ్గం` చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. టీమ్ సభ్యులు మార్చి మూడో వారంలో సినిమాను ‘గ్రాండ్’ గా రిలీజ్ చెయ్యనున్నారు.
బ్రహ్మానందం, సత్యప్రకాష్ , ఆనంద్ రాజ్, మదన్, తపస్వి, అపూర్వ, పృద్విరాజ్, టార్జన్, ధనరాజ్, తాగుబోతు రమేష్, చలపతి రావు తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలుః ఘటికాచలం; సంగీతంః షాయక్ పర్వేజ్; పీఆర్ ఓః రమేష్ చందు; ఫైట్స్ః నందు, దేవరాజ్ మాస్టర్, లైన్ ప్రొడ్యూసర్ః మారుశెట్టి సునీల్ కుమార్; ప్రొడ్యూసర్ :K. కోటేశ్వరరావు, దర్శకత్వం. ఎం ఏ చౌదరి.