మెగాస్టార్ స్టైలిష్ మాస్ ఎంటర్‌టైనర్ భోళాశంకర్ ఆగస్ట్ 11న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. తమన్నా, కీర్తిసురేష్, సుశాంత్ కీలక పాత్రల్లో నటించారు. భోళాశంకర్‌ను మెగా ఫ్యాన్స్‌కు నచ్చేలా క్వాలిటీకి వెనకాడకుండా ప్రొడ్యూస్ చేసిన నిర్మాత అనిల్‌సుంకర. యంగ్ హాస్యనటులంతా కనిపించబోతున్నా ఈ సినిమాని చాలా కాలం తర్వాత మెగా ఫోన్ పట్టి డైరెక్షన్ చేయబోతున్నాడు మెహర్ రమేష్. రిలీజ్ సందర్భంగా డైరెక్టర్ మెహర్ రమేష్ పాత్రికేయులతో ముచ్చటించారు.
మెగాస్టార్ తో సినిమా చేయాలన్న కల ఈ సినిమాతో తీరింది. రీమేక్ చేయడంలో రిస్క్ ఉంటుంది.. రిస్క్ కన్నా బిగ్ టాస్క్ అనుకున్నామన్నారు మెహర్ రమేష్. చిరంజీవి పవర్‌ఫుల్ బెంచ్‌మార్క్ క్రియేట్ చేసిన మూవీస్ రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు, గ్యాంగ్‌లీడర్ ల లాగా ఈ సినిమాను తీయాలనుకున్నాను అలాగే తీసానంటున్నారు మెహర్ రమేష్. పవర్‌స్టార్ మేనరిజంను ఇమిటేట్ చేయడం కూడా ప్రేక్షకులను కంప్లీట్‌గ ఎంటర్‌టైన్ చేయడం కోసమేనన్నారు మెహర్ రమేష్.
ఈ సినిమాలో సిస్టర్ క్యారెక్టర్‌లో చక్కని ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ పండించడానికి కీర్తి సురేష్ అయితే కరెక్ట్ అనుకున్నామన్నారు. స్వప్నదత్ గారి ద్వారా కీర్తి సురేష్‌కి కథ చెప్పామని స్వప్నదత్ కు థ్యాంక్స్ చెప్పారు మెహర్.
ఈ చిత్ర నిర్మాత అనిల్ చాలా ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్. చిరంజీవి గారితో సినిమా తీయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారనీ.. ఈ చిత్రంతో ఆ డ్రీమ్ నెరవేరినందుకు హ్యాపీగా ఫీలవుతున్నట్టు చెప్పారు.