ప్రస్తుతం ప్రపంచదేశాలన్నీ కరోనా వైరస్ కబంధ హస్తాల్లో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో మన దేశంలో లాక్ డౌన్ మస్ట్ అయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అదేశాల్ని అనుసరిస్తూ.. ఎవరింటికి వారు పరిమితమయ్యారు. అయితే ఈ లాక్ డౌన్ టైమ్ ను సినీ సెలబ్రిటీస్ వివిధ రకాలుగా వినియోగించుకుంటున్నారు. కొందరు తమకిష్టమైన వంటకాల్ని వండుకుంటున్నారు. మరికొందరు తమకిష్టమైన సినిమాల్ని చూస్తున్నారు… గేమ్స్ ఆడుతున్నారు… పుస్తకాలు చదువుతున్నారు. అయితే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ ఈ లాక్ డౌన్ టైమ్ ను బాక్సింగ్ ప్రాక్టీస్ తో సద్వినియోగం చేసుకుంటున్నాడు.
కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న బాక్సర్ అనే చిత్రం లో వరుణ్ తేజ బాక్సింగ్ ఛాంపియన్ గా సరికొత్త మేకోవర్ తో దర్శనమివ్వబోతున్నాడు. దాని కోసం ఎంతో కాలంగా బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఒరిజినల్ ఛాంపియన్ గా కనిపించాలని తీవ్రంగా కష్టపడుతున్నాడు. ‘నాకు నేను బలహీనంగా ఉన్నాను అనిపించిన ప్రతిసారీ.. బ్యాగ్‌ను మరింత గట్టిగా కొడుతున్నా’’ అంటూ తన ఇంట్లోనే బాక్సింగ్ బ్యాగ్‌తో కుస్తీ పడుతున్నాడు వరుణ్ తేజ . తాజాగా దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు వరుణ్.