VarunTej : మెగా హీరో వరుణ్ తేజ్ తన కెరీర్ ప్రారంభం నుంచే మంచి కథలకు ప్రాధాన్యతనిచ్చే నటుడిగా గుర్తింపు పొందాడు. కొన్ని ప్రయోగాలు కూడా చేశాడు. కానీ వాటితో పాటు వాణిజ్యపరంగా విజయవంతం కావాలనే కోరిక కూడా ఎప్పుడూ ఉంది. “గని”, “గాంధీవధారి అర్జున”, “ఆపరేషన్ వాలెంటైన్” వంటి చిత్రాల ఫెయిల్యూర్ తర్వాత, వరుణ్ తన కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు.
ఈ మధ్య, వరుణ్ 12 పెద్ద బ్యానర్ల నుంచి వచ్చిన కథలను తిరస్కరించాడట. కథలో కొత్తదనం ఉండటంతో పాటు, కమర్షియల్ యాంగిల్ కూడా ఉండాలని అతను కోరుకోవడమే దానికి కారణం. ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అందించే, నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టే కథలకే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.
ఇది నిజంగా మంచి నిర్ణయం. ఇప్పటి వరకు, వరుణ్ తనకు నచ్చిన కథలనే ఎంచుకుంటూ వెళ్లాడు. కానీ ఇప్పుడు, బాక్సాఫీసు వద్ద విజయం సాధించడానికి ఏం కావాలో అతను బాగా ఆలోచిస్తున్నాడు. వరుణ్ ప్రస్తుతం నటిస్తున్న “మట్కా” చిత్రం కమర్షియల్ గా విజయవంతం కావడానికి అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. దర్శకుడు కరుణ కుమార్ ఈ చిత్రంలో మరింత మసాలా దట్టించడానికి చాలా కష్టపడుతున్నాడు.