Matka movie : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ లేటెస్ట్ మూవీ ‘మట్కా’. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. కరుణకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్‌ మధ్యవయస్కుడుగానూ, యువకుడిగా రెండు విభిన్న పాత్రలను పోషిస్తున్నారు. అంతేకాకుండా, ఇంకో రెండు గెటప్‌లలోనూ ఆయన తెరపై కనిపించనున్నారు. ఆదివారం విడుదలైన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో వరుణ్‌ తేజ్‌ రెండు అవతారాల్లో కనిపించారు.

24 ఏళ్ల ప్రయాణంతో కూడిన ఈ కథలో మొత్తం నాలుగు అవతారాల్లో దర్శనమిస్తారన్నమాట. విశాఖపట్నం నేపథ్యంలో, పీరియాడిక్ కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో మట్కా సామ్రాజ్యాధీశుడిగా ఎదిగి, ఆ ప్రపంచాన్ని శాసించే వ్యక్తిగా వరుణ్‌ తెరపై కనిపించనున్నట్టు లుక్‌ చాటుతోంది. కథ సాగే కాలానికి తగ్గట్టుగా వింటేజ్ లుక్‌తో కనిపించనున్నారు.

నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో నవీన్ చంద్ర, సలోని, అజయ్ ఘోష్, కన్నడ కిశోర్, రవీంద్ర విజయ్, పి.రవిశంకర్‌ తదితరులు నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో ఛాయాగ్రహణం ఎ.కిశోర్‌ కుమార్, సంగీతం జి.వి.ప్రకాశ్‌కుమార్‌ అందించారు.

Leave a comment

error: Content is protected !!