Varuntej : 175 రోజుల విరామం తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన పాన్-ఇండియా చిత్రం ‘మట్కా’ సెట్స్‌పైకి తిరిగి వచ్చారు. ఈ చిత్రానికి కరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం కీలకమైన 40-రోజుల షెడ్యూల్ ఇటీవలే ప్రారంభమైంది. చిత్రబృందం ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్లో నాయకా నాయికలపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తోంది.
“కొత్త శక్తులు, కొత్త ఆకాంక్షలతో 175 రోజుల తర్వాత తిరిగి సెట్స్‌పైకి వచ్చాను. ‘మట్కా’ రెట్రో మాయాజాలానికి జీవం పోయడానికి సిద్ధమయ్యాను!” అని వరుణ్ తేజ్ తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకున్నారు. ‘మట్కా’ ఒక పీరియాడికల్ కథా చిత్రం, ఇది నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించబడింది. వరుణ్ తేజ్ నాలుగు విభిన్న గెటప్‌లలో నాలుగు విభిన్న కోణాల నుండి ఒక పాత్రను పోషిస్తున్నారు.
మీనాక్షి చౌదరి మరియు నోరా ఫతేహి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డా. విజేందర్ రెడ్డి తీగల మరియు రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం, కార్తీక శ్రీనివాస్.ఆర్. ఎడిటింగ్, ఎ. కిశోర్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిశోర్, రవీంద్ర విజయ్, పి. రవిశంకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాశ్ కుమార్, కూర్పు: కార్తీక శ్రీనివాస్.ఆర్, ఛాయాగ్రహణం: ఎ.కిశోర్ కుమార్. ‘మట్కా’ పాన్-ఇండియా ప్రేక్షకులను తప్పుకుండా అలరిస్తుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.