వివాదాలతోనే తన చిత్రాలకు ఫ్రీ పబ్లిసిటీ తెచ్చుకోవడం రామ్ గోపాల్ వర్మకి కొట్టిన పిండి. ఆయన ఏ సినిమా అనౌన్స్ చేసినా, మొదలు పెట్టినా, విడుదల చేసినా..  ఆ  చిత్రాల్ని వీక్షించడానికి ఒక వర్గం ప్రేక్షకులు రెడీ గా ఉంటారు. కొంతకాలంగా సినిమాలు తీయడంపై పట్టుకోల్పోయినప్పటికీ వర్మ ఎప్పటికప్పుడు తన సినిమాలతో ప్రేక్షకుల్ని థియటర్స్ కు రప్పించడంలో చాలా ట్రిక్కులు ప్లే చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఆయన రీసెంట్ గా ‘క్లైమాక్స్’ అనే సినిమాను తీసి .. ఏటీటీ అనే ఫార్ములాలో ఆన్ లైన్ లో విడుదల చేశారు. ఆ వెంటనే ‘నేకెడ్’ అనే మరో సినిమానూ అదే ఫార్మేట్లో విడుదల చేయడానికి  రెడీ అయిపోయాడు. ఇక ఇప్పుడు కొత్తగా ఆయన మహాత్మాగాంధీ అసాసిన్ స్టోరీని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. సినిమా పేరు ‘ఏ మేన్ హూ కిల్డ్ గాంధి’.

గాంధీ – గాడ్సేలతో కూడిన పోస్టర్ని విడుదల చేశారు. అంతేకాదు ఆ పోస్టర్న్‌ని ట్విట్టర్లో షేర్‌ చేస్తూ..‘‘ఈ రెండు ఫోటోలను ఇలా ఒకటిగా చూపించడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటంటే, గాంధీని చంపడం అంటే గాడ్సే తనను తాను చంపుకోవడమే అన్నమాట..’’అంటూ పేర్కొన్నారు. ఇప్పటికే ఈ చిత్రం పోస్టర్‌పై ప్రముఖ నాస్తికుడు బాబు గోగినేని మండిపడుతూ ఏమీటి, ఈ ఆకతాయితనం? అంటూ ట్విట్టర్లో ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

 

 

Leave a comment

error: Content is protected !!