Shopping Cart 0 items - $0.00 0

వారసుడొచ్చాడు

విక్టరీ వెంకటేశ్ కెరీర్ ను మలుపుతిప్పిన అద్భుతమైన కుటుంబ కథా చిత్రం ‘వారసుడొచ్చాడు’. స్రవంతి మూవీస్ బ్యానర్ పై ఎ.మోహన్ గాంధి దర్శకత్వంలో రవికిషోర్ నిర్మించిన ఈ సినిమాలో సుహాసిని కథానాయికగా నటించింది. కోట శ్రీనివాసరావు, గొల్లపూడి మారుతీరావు, తనికెళ్ళ భరణి, వసంత్, నిర్మలమ్మ, మాలశ్రీ, సంధ్య తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఇక అంబాజీరావు గా మోహన్ బాబు అద్భుతమైన నటన ఈ సినిమాకి హైలౌైట్ .  మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించిన ఈ సినిమా 1988, అక్టోబర్ 3న విడుదలై విజయ దుందుభి మోగించింది. చిన్నప్పుడు ఊరునుంచి పారిపోయి.. ఎక్కడో దిక్కుమొక్కు లేకుండా ఒక జబ్బుతో  మంచాన పడ్డ తన స్నేహితుడికిచ్చిన మాట ప్రకారం .. తనే వారసుడిగా ఆ ఊరు చేరిన కథానాయకుడు… తన స్నేహితుడి కుటుంబ సభ్యుల వ్యధని, వారి సమస్యల్ని ఎలా తీర్చాడు? అన్నదే మిగతా కథ. సరిగ్గా ఇదే స్టోరీ లైన్ తో త్రివిక్రమ్ మహేశ్ బాబు తో ‘అతడు’ సినిమా చేసిన సంగతి తెలిసిందే. నిజానికి ‘వారసుడొచ్చాడు’ చిత్రం తమిళంలో మోహన్, రూపిణి జంటగా.. మణివణ్ణన్ దర్శకత్వంలో వచ్చిన ‘తీర్త కరైయినిలే’ చిత్రానికి రీమేక్ వెర్షన్.  ఈ సినిమా అప్పట్లో తమిళనాట ఘన విజయం సాధించింది. ఆ సినిమాకి కూడా ఇళయరాజా సంగీతం ప్రాణం పోసింది.

Leave a comment

error: Content is protected !!