దక్షిణాదిన విలన్ పాత్రలకు పెట్టింది పేరుగా మారింది వరలక్ష్మీ శరత్ కుమార్. ‘పందెంకోడి 2, సర్కార్’ చిత్రాల్లో అమ్మడి విలనిజానికి ఫిదా అయ్యారు ప్రేక్షకులు. అలాగే.. తెలుగులోనూ ‘తెనాలి రామకృష్ణ’ చిత్రంలో వరూ విలన్ గా అదరగొట్టింది. త్వరలో రవితేజ ‘క్రాక్’ మూవీలోనూ వరలక్ష్మి విలన్ గా రానుంది.  ఇక మమ్ముట్టి మలయాళ చిత్రం ‘కసబ’ లో సైతం అమ్మడు తన విలనిజాన్ని రుచి చూపించింది. అయితే అప్పుడప్పుడు ఆమె లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లోనూ డైనిమిక్ లేడీ అవతారం ఎత్తుతూ ఉంటుంది. అలాంటి ఓ చిత్రమే ‘డ్యానీ’.  ఆ సినిమాకి సంబంధించిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక ఈ సినిమాను డైరెక్ట్ గా  ఓటీటీలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారట. ‘డ్యానీ’ సినిమాను ముత్తయ్య నిర్మించగా.. సంతాన మూర్తి దర్శకత్వం వహించారు.  సంతోష్ దయానిధి సంగీతం అందించారు. ఇటీవలే కీర్తి సురేష్ ‘పెంగ్విన్.. జ్యోతిక ‘పొన్ మగళ్ వందాల్’ సినిమాలు ఓటిటిలో విడుదల అయ్యాయి. ఇప్పుడు  ‘డ్యానీ’  సినిమా కూడా త్వరలో ఓటీటీలో విడుదల చేసేందుకు తమిళ నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి డ్యానీగా వరలక్ష్మీ శరత్ కుమార్ ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.

 

 

 

Leave a comment

error: Content is protected !!