వరలక్ష్మీ శరత్‌కుమార్ మనసు మార్చుకుంది. మొత్తానికి వరూ వధువు కాబోతుంది. టాలీవుడ్ జయమ్మగా తెలుగు ఆడియెన్స్ చేత శెభాష్ అనుపించుకున్న వరలక్ష్మీ..రీసెంట్ గా హనుమాన్‌లో అద్భుతమైన పాత్ర పోషించి పాన్ ఇండియా స్థాయిలో మెప్పించింది.
అయితే మనసు మార్చుకుంది అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. వరలక్ష్మీ వాస్తవానికి అసలు పెళ్లి చేసుకోననీ.. పెళ్లి చేసుకోకుండా బ్రతకొచ్చనీ ధైర్యంగా చెప్పింది. తాను లైఫ్ లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని కూడా చెప్పింది. అయితే ఇప్పుడు మాత్రం పెళ్లి కూతురయింది. ముంబై బిజినెస్‌మేన్ నికోలయ్ సచ్‌దేవ్‌తో పెళ్లిపీటలెక్కబోతుంది. వీరి ఎంగేజ్‌మెంట్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.