Varalakshmi Sarath kumar : వరలక్ష్మి శరత్‌కుమార్ టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ నటీమణి. క్రాక్, వీరసింహారెడ్డి చిత్రాలలో నెగిటివ్ రోల్స్ చేయడం ద్వారా ఆమె తన కెరీర్‌కు ఇక్కడ గట్టి పునాదులు వేసుకుంది. ఇప్పుడు వరూ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ తెలుగు సినిమాల్లో నటిస్తోంది. ఇదిలా ఉంటే… కొద్ది రోజుల క్రితం ఆమె తన బాయ్ ఫ్రెండ్ నికోలాయ్ సచ్‌దేవ్‌ని థాయ్‌లాండ్‌లో పెళ్లాడిన సంగతి తెలిసిందే.
తాజాగా వీరిద్దరూ హైదరాబాద్‌లో విలేకరులతో సమావేశమయ్యారు. వివాహం తన నటనకు ఆటంకం కలిగించదని, బహుళ భాషలలో సినిమాలు చేయడానికి తన భర్త చాలా సపోర్ట్ చేస్తున్నాడని పేర్కొన్నారు. తెలుగు చిత్రసీమలో ఇది నా కెరీర్ ప్రారంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో ఎన్నో డాషింగ్ రోల్స్ చేయాలని కోరుకుంటున్నాను అని వరలక్ష్మి అన్నారు. ఆమె చివరిసారిగా శబరి అనే మహిళా ప్రధాన చిత్రంలో నటించింది.