ఆకర్షించే ముఖం.. అందమైన పలువరుస.. అలరించే నవ్వు.. తీరైన శరీర సౌష్ఠవం.. సన్నని నడుము.. గ్లామరస్ అపీరెన్స్ .. వెరసి వాణీ విశ్వనాథ్. ఎయిటీస్ లోని ప్రేక్షకులకు ఆమె ఒక కలల రాకుమారి. అప్పటి అగ్ర హీరోల  సరసన నటించి మెప్పించిన ఆ మలయాళ సుందరి తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో తనదైన శైలిలో నటించి సత్తా చాటుకుంది. జగపతి బాబు డెబ్యూ మూవీ సింహస్వప్నం’ చిత్రంతో  హీరోయిన్‌గా తెలుగులో అవకాశం అందుకుంది. ‘ఘరానా మొగుడు’ చిత్రంలో మెగాస్టార్ తో నటించి  గ్లామరస్  హీరోయిన్‌గా మంచి పేరొచ్చింది. ఆ తర్వాత ‘నా మొగుడు నాకే సొంతం, మా ఇంటి కథ, కొదమ సింహం, వదిన గారి గాజులు, ప్రేమ చిత్రం పెళ్ళి విచిత్రం, మామా – కోడలు, లేడీస్‌ స్పెషల్‌, జోకర్‌, ప్రేమ అండ్‌ కో, రైతుభారతం’ తదితర తెలుగు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది.

వాణీ విశ్వనాథ్‌కు 1995లో తెలుగులో ఫిలిం కెరీర్‌లో బ్రేక్‌ వచ్చి, తమిళ, మలయాళ చిత్రాల్లో బిజీ అయింది. గుర్రపు స్వారీ, స్టంట్స్‌ కూడా నేర్చుకుని విజయశాంతి తరహా చిత్రాలు, నెగెటివ్‌ షేడ్స్‌ వున్న చిత్రాలు, ఆఫ్‌బీట్‌ చిత్రాలు, కమర్షియల్‌ చిత్రాలు 2002వరకు చేసింది. 2002లో ప్రతినాయక పాత్రలు పోషించే మలయాళీ నటుడు బాబూరాజ్‌ని పెళ్లి చేసుకొని మద్రాసులో స్థిరపడింది. రీసెంట్ గా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన ‘జయ జానకీ నాయక’ చిత్రంలో ఒక ప్రత్యేక పాత్రతో రీ ఎంట్రీ ఇచ్చిన వాణీ విశ్వనాథ్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆ అందాల వాణికి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

Leave a comment

error: Content is protected !!