వంశీ ‘అన్వేషణ’ మూవీకి బాగా ఇన్ స్పైరై .. ఆయన దర్వకత్వంలోనే ఒక అడ్వెంచరస్ మూవీ తీయాలని ప్లాన్ చేశారు కళ్యాణ్ మూవీ ఆర్ట్చ్ సంస్థ. అయితే సరైన హీరో కోసం అన్వేషిస్తూ రెండేళ్ళ పాటు వెయిట్ చేశారు .. అప్పుడే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్ బాబు. అప్పటికి హీరోగా రెండు మూడు సినిమాలు చేసి ఉన్నాడు రమేశ్ . ‘సాహస యాత్ర’ టైటిల్ తో ఒక సినిమా చేయడానికి ప్లాన్ చేసుకొని నిర్మాతలు వంశీని , హీరో కృష్ణని కూడా కలిసారు. డీల్ ఓకే అయింది కూడా . అయితే ఎందుకోగానీ.. ప్రారంభం అవకుండానే ఆ ప్రాజెక్ట్ పక్కకు వెళ్ళిపోయింది. అప్పట్లో ఈ సినిమా కానీ..వచ్చి ఉండుంటే.. వంశీ డైరెక్టర్ కాబట్టి.. ఇళయరాజా ఖచ్చితంగా సంగీతం అందించి ఉండేవారు. అప్పుడు వంశీ అడ్వెంచరస్ స్టోరీకి ఆయన సంగీతం ఖచ్చితంగా హైలైట్ అయి.. సినిమా ‘అన్వేషణ’ను మించిన స్థాయిలో హిట్టయి ఉండేదేమో..

Leave a comment

error: Content is protected !!