‘పవర్ స్టార్ ప‌వ‌న్‌ కళ్యాణ్’ అభిమానులు ఈ పేరును సిల్వర్ స్క్రీన్ పై చూడక నేటికి మూడు ఏళ్ళు. ఇన్నేళ్ళ విరామం తర్వాత ప‌వ‌న్‌ కళ్యాణ్ నటించిన ‘వ‌కీల్ సాబ్‌’ సినిమా ఏప్రిల్ 9న అంటే రేపు విడుదలవుతుంది. సినిమాకి సంబంధించిన పాటలు, టీజర్‌, ట్రైలర్‌… సినిమాపై అటు అభిమానులలోను ఇటు సిని సెలబ్రిటీలలోను ఇప్పటికే భారీగా అంచనాలు ఏర్పడాయి. ఇది ఇలా ఉండగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ఖాతాలో పవన్ కళ్యాణ్ హెయిర్ స్టైల్ ను తాను సరిచేస్తున్న ఫోటోను షేర్ చేస్తూ…

“చాలా కాలం తరువాత పవన్ కళ్యాణ్ ని వెండితెర మీద చూడటానికి  మీలాగే నేనుకూడా  ఎదురుచూస్తున్నాను. అమ్మ , కుటుంబ సభ్యులతో రేపు సాయంత్రం థియేటర్ లో ‘వకీల్ సాబ్’ చూస్తున్నాను”. అంటూ ట్వీట్ చేశారు మెగాస్టార్.

Leave a comment

error: Content is protected !!