ప‌వ‌న్‌కళ్యాణ్ దాదాపు 3 సంవత్సరాల గ్యాప్‌ తర్వాత నటించిన సినిమా ‘వ‌కీల్ సాబ్‌’. ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పాటలు, టీజర్‌, ట్రైలర్‌… ఓ రేంజ్‌లో ఉండటంతో…  సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలున్నాయి. శ్రీరామ్ వేణు ద‌ర్శ‌కుడు.  ప్ర‌ముఖ నిర్మాత బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, బే వ్యూ ప్రాజెక్ట్స్ ప‌తాకాల‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ తో  ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుద‌ల కాబోతోంది. తాజాగా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న చిత్రయూనిట్ అఫీషియల్‌గా సెన్సార్ రిపోర్ట్ తో కూడిన పోస్టర్‌ను విడుదల చేసింది.

Leave a comment

error: Content is protected !!