సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో చెప్పుకోదగ్గ చిత్రం ‘వజ్రాయుధం’. లక్ష్మీ ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ పై  దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో కె.లింగమూర్తి నిర్మించిన ఈ సినిమా 1985 లో విడుదలై అఖండ విజయం సాధించింది. సరిగ్గా  35 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా కు ప్రధాన ఆకర్షణ అందాల శ్రీదేవి గ్లామర్. కృష్ణకిది 229వ చిత్రం అవడం విశేషం.  రావుగోపాలరావు, అల్లు రామలింగయ్య, పి.యల్.నారాయణ, నూతన్ ప్రసాద్, కైకాల సత్యనారాయణ, ఇతర బేబీ సీత ముఖ్యపాత్రలు పోషించారు. సిన్సియర్ పోలీసాఫీసర్ ప్రతాప్ .. సార్వభౌమరావు అక్రమానికి ఎలా బలయ్యాడు? తిరిగి ప్రతాప్..కిరీటిగా మారి  అతడిపై ఎలా పగతీర్చుకున్నాడు అనేదే సినిమా కథ. అయితే ఇందులో శ్రీదేవి పోషించిన పొగరుబోతు పాత్ర సినిమాకే హైలైట్. చక్రవర్తి సంగీతం అందించిన ఈ సినిమాలో… సన్నాజాజి పక్కమీద సంకురాత్రి, నీ బుగ్గమీద ఎర్ర మొగ్గలేందబ్బా..  వసంత తరువుల లాంటి పాటలు అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి. అలాగే.. ఇందులో రావుగోపాలరావు విలనిజం.. అల్లు రామలింగయ్య కామెడీ ఎంతగానో ఆకట్టుకుంటాయి.

Leave a comment

error: Content is protected !!