Vaishnavi Chaitanya : లాస్టియర్ టాలీవుడ్ లో .. మంచి గుర్తింపు తెచ్చుకున్న సినిమాల్లో ‘బేబీ’ ఒకటి. టాలెంటెడ్ డైరెక్టర్ సాయి రాజేష్ తెరకెక్కించిన ఈ సినిమా యువతను బాగా ఆకట్టుకుంది. హీరోయిన్‌గా వైష్ణవి చైతన్య నటనకు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. తన అందంతో పాటు అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించింది. నిజం చెప్పాలంటే.. వైష్ణవి గ్లామర్ అండ్ పెర్ఫార్మెన్స్ వల్లనే యువత ఈ సినిమాకు క్యూ కట్టారు.

ప్రేమ విషయంలో ఇప్పటి యువత అభిప్రాయాలు, వారి ప్రవర్తన ఏంటి అన్న విషయాల్లో దర్శకుడు బాగా రీసెర్చ్ చేశాడు అనిపిస్తుంది. అంత సహజంగా ఈ సినిమా తెరకెక్కింది. కొన్ని సన్నివేశాలు, సంభాషణల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం అయినప్పటికీ.. బేబీ మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది.

తాజాగా ప్రకటించబడిన ఫిలింఫేర్ అవార్డులలో ‘బేబీ’ సినిమాలోని తన పాత్రకు ఉత్తమ నటి అవార్డును అందుకుంది హీరోయిన్ వైష్ణవి చైతన్య . ఈ అవార్డు వైష్ణవికి రావడంతో ఆమె అభిమానులు, చిత్ర యూనిట్ సభ్యులు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆమె ఆ అవార్డ్ కు అన్ని విధాలా అర్హురాలు అని అందరి నుంచి అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Leave a comment

error: Content is protected !!