షేడ్ స్టూడియోస్ సమర్పణలో చైతన్య వర్మ, హారిక వర్మ, వినయ్ కశ్యప్, రాకీ, హారిక, సతీష్ సారిపల్లి, శృతి మెహర్, జయ నాయుడు, లలితా జోస్యూల, ర్యాలీ మోహన్ రావు  నటీనటులు గా రాజు పాట్ల దర్శకత్వంలో కె తరుణ్, JSS రాజు పాట్ల లు సంయుక్తంగా కలసి నిర్మించిన డెమో షాట్ ఫిల్మ్  “ఉత్తర దక్షిణ” ఈ డెమో ఫిల్మ్ ను షేడ్ స్టూడియోస్ సపోర్ట్ తో యూట్యూబ్ లో విడుదల చేశారు.ఈ షార్ట్ ఫిల్మ్ ప్రీమియర్ షోను నటుడు,నిర్మాత డి.యస్ రావు, నిర్మాత తుమ్మలపల్లి రామ సత్య నారాయణ మొదలగు సినీ పెద్దలకు ప్రదర్శించడం జరిగింది. ఈ సందర్భంగా* 
*ముఖ్య అతిథిగా వచ్చిన నటుడు నిర్మాత డి.ఎస్.రావు మాట్లాడుతూ* .. ఈ సినిమా చూసిన తర్వాత డైరెక్టరు మట్టి లోని మాణిక్యాలను వెలికితీసి నట్టు ఆర్టిస్టులతో చాలా మంచి నటనను రాబట్టుకున్నాడు.  కొత్తవారైనా చాలా టాలెంట్ ఉన్నట్లు ఎక్సలెంట్ గా నటించారు. దర్శకుడు చాలా ఏకాగ్రతతో ఈ సినిమా  తీశాడు. నేను సినిమాను చూసినప్పుడు క్యూరియా సిటీగా  చాలా కాన్సెంట్రేట్ గా చూడడం జరిగింది. ఒక ఆడియన్  మనసులో ఏది చొరబడకుండా స్క్రీన్ పైనే  ఏకాగ్రతగా చూసినప్పుడే  అక్కడ డైరెక్టర్  సక్సెస్ అయినట్లు .ఈ సినిమాను దర్శకుడు చాలా బాగా తీశాడు. అలాగే మాస్క్ పెట్టుకోకుండా తిరిగే వారికోసం తీసిన “అజ్ఞాని”  కూడా చాలా బాగుంది.ఈ అజ్ఞానం షార్ట్ ఫిల్మ్ ను ట్రైలర్ గా ప్రతి సినిమా హాల్ లో  వేస్తే  ప్రజల్లో అవెర్ నెస్ తీసుకు వచ్చిన వారిమవుతాను. ఇందులో మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఇది నా హార్ట్ కు టచ్ అయ్యింది. ఇంత బాగా తీసిన చిత్ర యూనిట్ కు అల్ ద బెస్ట్ తెలియజేశారు. 
 *నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మాట్లాడుతూ* ..ఈ సినిమా ఈ షార్ట్ ఫిలిం చూశాను చాలా అద్భుతంగా ఉంది.కొత్త వాళ్ళు అయినా చాలా బాగా తీశారు. పెద్ద ప్రొడ్యూసర్ దగ్గర ట్రై చేయండి అక్కడ కాకపోతే నేను ప్రొడ్యూస్ చేస్తాను అని అన్నారు. 
 *షేడ్ స్టూడియోస్ అధినేత దేవి ప్రసాద్ మాట్లాడుతూ* ..నేను కూడా 10 సంవత్సరాల క్రితం ఇలా షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ..ఎక్కడ.. ఎలా.. రిలీజ్ చేయాలో తెలియక తిరిగేవాణ్ణి అప్పుడు నాకు ఎటువంటి ప్లాట్ ఫామ్  ఉండేది కాదు.అలా నాకు అప్పుడు పుట్టిన ఐడియానుండి పుట్టుకొచ్చిందే  షేడ్ స్టూడియోస్. ఉత్తర దక్షిణ డెమో ఫిల్మ్ చూశాను  చాలా బాగుంది. చాలామంది డెమో ఫిలిమ్స్ చేస్తుంటారు.కానీ ప్రతి ఫ్రెమ్ కూడా ఆర్టిస్ట్స్,కెమెరా, మ్యూజిక్ ఇలా అన్ని ఈక్వల్ గా బ్యాలెన్స్ చేస్తూ 24 క్రాఫ్ట్స్ లో అందరినీ చాలా కేర్ తీసుకొని చేశాడు దర్శకుడు రాజు.ఇప్పుడు ఇలాంటి మంచి షార్ట్ ఫిలిమ్స్ మా షేర్ స్టూడియోస్ హెల్ప్ అవుతున్నందుకు నా ఫస్ట్ సక్సెస్ ఇదే అనిపిస్తుంది.షార్ట్ ఫిలిం గాని పెద్ద సినిమా గానీ చేయడం అంత ఈజీ కాదు.ఒక పెళ్లి చేస్తే అందరినీ ఎలా కేర్ తీసుకొని  వారికి భోజనాలు ఏర్పాటు చేసి వారికి ఇబ్బంది కలగకుండా చూసుకొని పెళ్లి కార్యక్రమం చేస్తామో. అలాగే సినిమా తీసినా డెమో ఫిల్మ్ తీసినా కూడా ప్రతిరోజు ఒక పెళ్లి చేసినట్టే అవుతుంది. ఒక పెళ్లి చేస్తే ఏమి అవసరమో అన్నీ ఇందులో ఉంటాయి. ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు అనే వారు ఇప్పుడు సినిమా చేసి చూడు ఆ కష్టం ఏంటో తెలుస్తుంది అనడంలో సందేహం లేదు.
ఎవరి దగ్గరైనా మంచి కాన్సెప్ట్ ఉండి మమ్మల్ని అప్రోచ్ అయితే  మేము మొత్తం పోస్ట్ ప్రొడక్షన్  సెటప్ అందిస్తాము. చాలామందికి షూటింగ్ కే బడ్జెట్ అయిపోతుంది పోస్ట్ ప్రొడక్షన్ కి బడ్జెట్ ఉండదు అటువంటి వారిని మేము టేకోవర్ చేసి మేము సపోర్ట్ గా ఉంటాము అని అన్నారు
 *చిత్ర దర్శకుడు రాజు పాట్ల మాట్లాడుతూ…..* రాజ్ కందుకూరి గారు, తుమ్మల పల్లి రామ సత్య నారాయణ , డి.యస్ రావు గారికి ధన్యవాదాలు వారంతా బాగా సపోర్ట్ చేశారు ఒక డెమో ప్రాజెక్ట్ ద్వారా ఎవరిక్రే రాని ఆకాశం కల్పించి చిత్రం విజయవంత మైనట్లు చేశారు,నిర్మాతలు, షెడ్ స్టూడియో వారు వారికి నా ధన్యవాదాలు. శుక్రన్ గారు నాకు చాలా హెల్ప్ చేశారు. ఉత్తర దక్షిణ తో పాటు నేను తీసిన అజ్ఞానిని  చూసిన వారందరూ కూడా చూసిన టూ మినిట్స్ లోనే  ఎమోషన్ కనెక్ట్ అవుతున్నారు. అందరికీ నచ్చాలని తీశాను. ఇది ఒక డెమో ప్రాజెక్టు ఇందులో 26 మినిట్స్ మాత్రమే తీయడం జరిగింది.చాలా ఎమోషన్ తో కూడుకున్న సినిమా ఇది. దీని తర్వాత ఇంకా వన్ అండ్ ఆఫ్ అవర్ కథ ఉంది. నేను చెప్పిన దాంట్లో ఫైవ్ పర్సెంట్ కథ కూడా తీయలేదు.మీ అందరి సపోర్ట్ ఉంటే ఈ డెమో ఫిల్మ్ ను ఓటిటి కంటెంట్ కు సినిమాగా తీసి ఫిబ్రవరి 14 కంతా  ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాను. ఆర్ జి గారి ఒక్క యాడ్ వల్ల సినిమా పుట్టింది. ఆయనను ఇంప్రెస్ చేయాలని కరోనా ను కూడా లెక్క చేయకుండా ఈ ప్రాజెక్ట్ చేశాను. ఈ ఫిల్మ్ కు యూట్యూబ్ లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.చాలా మంది షేర్ చేస్తున్నారు.వారికి నా ధన్యవాదాలు. నేను చేసిన ఈ టూ మినిట్స్ ప్రాజెక్ట్ ను ఆర్.జి.వి గారికి డెడికెడ్ చేస్తున్నాను అన్నారు 
 *చైతన్య వర్మ మాట్లాడుతూ* ….రాజు నాకు ఏదైతే కథ నాకు నెరేట్ చేశాడో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అదే తీశాడు. స్క్రీన్ మీద కనిపించిన అందరూ చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు.వీరంతా ఇంత బాగా చేశారు అంటే ఆ కష్టం అంతా రాజు గారికే చెందుతుంది. సినిమా చూసిన నాకు  హాట్ ఫుల్ గా ఫీల్ కలిగింది అన్నారు.
 *హారిక మాట్లాడుతూ.* .ఈ సినిమాలో నేను చిన్నప్పుడు క్యారెక్టర్ చేశాను .ఇంత మంచి షార్ట్ ఫిలింలో నన్ను తీసుకు న్నందుకు దర్శక,నిర్మాత లకు ధన్యవాదాలు అన్నారు. 
ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటీనటులందరూ ఇంతమంచి కంటెంట్ ఉన్న చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు తెలియజేశారు.
 *నటీ నటులు:* 
చైతన్య వర్మ, హారిక వర్మ, వినయ్ కశ్యప్, రాకీ, హారిక, సతీష్ సారిపల్లి, శృతి మెహర్, జయ నాయుడు, లలితా జోస్యూల, ర్యాలీ మోహన్ రావు తదితరులు 
 *సాంకేతిక నిపుణులు* 
బ్యానర్ :షేడ్ స్టూడియోస్  
సినిమా : ఉత్తర దక్షిణ  
జోనర్ : లవ్ & ఎమోషన్
విడుదల : షేడ్ స్టూడియోస్ యూట్యూబ్ 
విడుదల తేదీ : 8 అక్టోబర్ 2021
నిర్మాతలు : కె తరుణ్ JSS రాజు పాట్ల 
డి.ఒ.పి : M. శివ కుమార్ 
రచన, దర్శకత్వం  : రాజు పాట్ల. 
ఎడిటింగ్ & DI : సాయి కిరణ్. 
సంగీతం సాయి దేవ హర్ష 
గాయకుడు : కృష్ణ భరద్వాజ్ 
ట్యూన్ : దిలీప్ వడ్డాది 
టైటిల్ కార్డ్స్  : మనోజ్ కుమార్ 
ప్రోమో కట్  : దిలీప్ రెడ్డి. 
ఫాంట్ : విజయ్ 
డబ్బింగ్ : రైథమ్ స్టూడియో 
సౌండ్ ఇంజనీర్ : షణ్ముఖేష్ వాసం 
SFX : రామకృష్ణ కానూరి 

Leave a comment

error: Content is protected !!