Upendra : దాదాపు ఏడేళ్ల తర్వాత స్వీయ దర్శకత్వంలో ఉపేంద్ర తీస్తున్న సినిమా ‘యూఐ’. అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తాజాగా ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, ప్రచార చిత్రాలు సినిమాపై భారీ అంచనాలను రేకెత్తిస్తున్నాయి. ఉపేంద్ర మార్క్ సినిమాగా నిలుస్తుందనే అంచనాలున్నాయి.

‘యూఐ’ అనేది ఉపేంద్ర సృష్టించిన ఒక కల్పిత ప్రపంచం. ఈ ప్రపంచంలో ఉపేంద్ర ఒక డెమిగాడ్‌గా కనిపించనున్నాడు. ఈ కొత్త ప్రపంచంలోని కథను తెరపై ఆవిష్కరించడానికి ఉపేంద్ర సిద్ధమయ్యాడు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో ఉపేంద్ర ఆహార్యం, బ్యాక్‌గ్రౌండ్ లొకేషన్ వ్యవహారమంతా ఓ కొత్త వరల్డ్ లోకి తీసుకెళ్తున్నట్లే క‌నిపిస్తుంది. అజనీష్ లోకనాథ్ సంగీతం ఈ సినిమాకు మరో ఆకర్షణ.

కన్నడ చిత్ర పరిశ్రమ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందుతుంది. ‘కేజీఎఫ్’, ‘కాంతార’ లాంటి సినిమాలు కన్నడ చిత్ర పరిశ్రమకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ‘యూఐ’ కూడా ఈ జాబితాలో చేరాలనేది ఉపేంద్ర ఆశ. ‘కబ్జా’ సినిమాతో ఉపేంద్ర చేసిన ప్రయోగం విఫలమైంది. అయితే, ‘యూఐ’తో ఆయన మరోసారి మంత్రం వేయడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమా ఉపేంద్ర కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందా లేదా అన్నది చూడాలి. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఉపేంద్ర సృష్టించిన కొత్త ప్రపంచం ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. అక్టోబర్‌లో విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!