గ్లోబల్ స్టార్‌ రామ్‌చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు ఎప్పుడవుతారా అని కోట్లాది అభిమానులు ఎదురుచూసారు. ఈ ప్రాసెస్ లేట్‌ కావడంతో విమర్శించినవాళ్లూ ఉన్నారు. అయితే ఎట్టకేలకు చెర్రీ ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారంటూ మెగాస్టార్‌ చిరు సోషల్ మీడియా వేదికగా అనౌన్స్‌ చేసారు. అప్పటి నుంచి మెగా కుటుంబంలో , మెగా ఫ్యాన్స్‌లో ఆనందం వెల్లివిరిసింది. ఇదే క్రమంలో ట్రిపుల్‌ ఆర్ టీమ్‌కు ఆస్కార్‌ అవార్డ్‌ రావడం మరింత విశేషం. ఇప్పుడు ఉపాసన సీమంత వేడుకలు దుబాయ్‌లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో సెలబ్రేషన్ చేసారు.


ఉపాసన బేబీ షవర్ వేడుకలను దుబాయ్‌లో ఆమె సోదరి అనుష్పాల కామినేని, సింధూరి రెడ్డి అద్భుతంగా అరేంజ్‌ చేసారు. ఈ వేడుకలో బంధుమిత్రులు హంగామాతో పాటు ఉపాసన అమ్మమ్మ ప్రధానాకర్షణగా నిలిచారు.
అపోలో హాస్పిటల్స్‌లో సీఎస్ఆర్‌ వైస్ చైర్‌పర్సన్‌గా , యువ‌ర్ లైఫ్ వ్య‌వ‌స్థాప‌కురాలిగా ఉపాసన బాధ్యతలను అద్భుతంగా నిర్వహిస్తూనే గ్లోబల్‌స్టార్‌ రామ్‌ చరణ్ భార్యగా, మెగా కోడలిగా కుటుంబ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తూ ఉంది. తల్లి కాబోతున్న ఈ మధుర క్షణాలను మెగా కుటుంబం ఆస్వాదిస్తోంది.
గ్లోబల్‌స్టార్‌ ఇమేజ్‌ సాధించిన చెర్రీ ని తండ్రిని చేస్తూ అంతకు మించిన ఆనందాన్ని ఇస్తోంది ఉపాసన. మాతృత్వపు మధురానుభూతిని ఆస్వాదిస్తూ.. తల్లిదండ్రులుగా చెర్రీ ఉపాసనల జీవన ప్రయాణం మరింత అద్భుతంగా సాగాలని మూవీవాల్యూమ్‌.కామ్‌ మనసారా కోరుకుంటోంది.

Leave a comment

error: Content is protected !!