‘క్షణం, జ్యోతిలక్ష్మి, ఇస్మార్ట్ శంకర్ , బ్లఫ్ మాస్టర్’ లాంటి చిత్రాలతో టాలీవుడ్ లో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు యువ నటుడు సత్యదేవ్. పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ కథల్ని మాత్రమే ఎంపిక చేసుకొని మరింతగా  పేరు తెచ్చుకోవడానికి ముందుకు సాగుతోన్న ఇతగాడు నటించిన తాజా చిత్రం ‘ఉమామహేశ్వరా ఉగ్రరూపస్య’.  మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘మహేషిండే ప్రతీకారం’ చిత్రానికిది రీమేక్ వెర్షన్. అందులో ఫహద్ ఫాజిల్ చేసిన ఫోటో గ్రాఫర్ పాత్రకు నూటికి నూరు శాతం యాప్ట్ అయ్యే నటుడు సత్యదేవ్.

‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ వెంకటేశ్ మహా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఉమామహేశ్వరా ఉగ్రరూపస్య’ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. క్లీన్ యూ సర్టిఫికెట్ దక్కించుకున్న ఈ సినిమా తెలుగు లో కూడా మంచి సక్సెస్ అందుకుంటుందనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్ . ఆర్కా మీడియా బ్యానర్ పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, విజయ్ ప్రవీణ్ పరుచూరి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమా మలయాళ చిత్రం స్థాయిలోనే విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.

 

 

Leave a comment

error: Content is protected !!