Turbo movie : అందరూ ఆ సినిమాను తీవ్రంగా విమర్మించారు. మమ్ముట్టి కెరీర్ లోనే ఈ సినిమా ఘోరమైన ఫ్లాప్ గా నిలుస్తుందని రివ్యూస్ వచ్చాయి. అయితే అందరి అంచనాల్ని తల్లకిందులు చేస్తూ ఆ సినిమా మాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సునామీలా విరుచుకు పడుతోంది. ఆ సినిమా పేరు టర్బో. పులిమురుగన్ ఫేమ్ వైశాఖ్ దీనికి దర్శకుడు.

మలయాళ సినీ పరిశ్రమలో మెగాస్టార్ మమ్ముట్టి టాప్ హీరోలలో ఒకరు. బహుముఖ నటనకు పేరుగాంచిన ఆయన ప్రతి సినిమాలోనూ ఏదో కొత్తదనం చూపించాలని తపించే నటుడు. ఆయన నటించిన తాజా చిత్రం “టర్బో” ప్రపంచ వ్యాప్తంగా రూ.70 కోట్లకు పైగా వసూళ్ళను రాబట్టి బాక్సాఫీస్ సెన్సేషన్ అయ్యింది!

కేవలం తొమ్మిది నెలల్లోనే ఆయన నాలుగు వేరువేరు జానర్లకు చెందిన సూపర్ హిట్ చిత్రాలు కణ్ణూర్ స్క్వాడ్, కాదల్-ది కోర్, భ్రమయుగం, టర్బో సూపర్ హిట్స్ అవడం విశేషం. మమ్ముట్టి పైప్‌లైన్‌లో ప్రస్తుతం “కడుగన్నావా ఒరు యాత్ర” , “బజూకా” అనే సినిమాలు ఉన్నాయి. అంతేకాకుండా, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ మలయాళ మెగాస్టార్‌తో జట్టుకడతారనే బలమైన వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

Leave a comment

error: Content is protected !!