నానీ హీరోగా నటించిన ‘నిన్నుకోరి’ చిత్రం మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన శివ నిర్వాణ మంచి వర్తున్న డైరెక్టర్ అనిపించుకున్నాడు. అందుకే నానీ ఇప్పుడా దర్శకుడికి మరో అవకాశమిచ్చాడు . ‘టక్ జగదీశ్’ అనే వెరైటీ టైటిల్ ను ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా ఈ రోజే ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు క్లాప్ కొట్టారు. దర్శకుడు కొరటాల శివకు శివ నిర్వాణ స్ర్కిప్ట్ హ్యాండ్ ఓవర్ చేయగా.. నవీన్ ఎర్రినేని కెమేరా స్విచాన్ చేశారు. నానీ 26 వ మూవీగా రానున్న ఈ మూవీని షైన్ స్ర్కీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీశ్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఫిబ్రవరి 11న రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ‘టక్ జగదీష్’ లో రీతూవర్మ, ఐశ్వర్యా రాజేశ్ కథానాయికలు గా నటిస్తున్నారు. గోదావరి బ్యాక్ డ్రాప్ లో సాగే అన్నదమ్ముల ఎమోషనల్ కథ తో ఈ సినిమా రూపొందనుండగా.. దీనికోసం నానీ తన డిక్షన్ ను , బాడీ లాంగ్వేజ్ ను పూర్తిగా మార్చుకోబోతున్నాడట. అలాగే.. ఇందులో నానీ అన్నయ్యగా జగపతిబాబు నటించనున్నాడని తెలుస్తోంది. యస్.యస్ తమన్ సంగీతం సమకూర్చుతుండగా.. ప్రసాద్ మారెళ్ళ చాయాగ్రహణం అందిస్తున్నాడు.