Raviteja : మాస్ మహారాజ రవితేజ అప్ కమింగ్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’ . హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, జగపతిబాబు ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. సోమవారం చిత్రబృందం ‘షో రీల్’ పేరుతో ఒక గ్లింప్స్ వీడియోను విడుదల చేసింది. దీనికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

దాదాపు నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోలో ఒక్క డైలాగ్ లేకున్నా, రవితేజ యాక్షన్ హంగామాతో అదరగొట్టారు. ఈ చిత్రంలో రవితేజ నిజాయితీ గల ఆదాయపన్ను అధికారి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ రాజకీయ నాయకుడి ఇంటిపై ఆయన దాడి చేసి అక్కడ ఏం జరిగిందనేది కథాంశం. షోరీల్ ఆఖరులో అమితాబ్ బచ్చన్ కటౌట్ ముందు రవితేజ యాక్టింగ్ హైలైట్ గా మారింది. త్వరలోనే ఈ సినిమాకి విడుదల తేదీని ప్రకటించబోతున్నారు మేకర్స్.

Leave a comment

error: Content is protected !!