ToXic movie : కన్నడ రాక్ స్టార్ యశ్ , బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ జోడీగా నటిస్తున్న చిత్రం ‘టాక్సిక్’. ‘ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార, హుమా ఖురేషీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

డ్రగ్ మాఫియా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంక ఈ చిత్రం గురించి ఇప్పుడు మరో ఆసక్తికర అప్డేట్ వచ్చింది. 1950-70ల మధ్య కాలంలో జరిగే కథగా ఈ చిత్రం తెరకెక్కుతుందని సమాచారం. అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబిలంచేలా బెంగళూరు శివార్లలో భారీ సెట్లు వేసి, అక్కడే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు . ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ చిత్రీకరణ లండన్‌లో జరగనుంది. ప్రముఖ సంగీత దర్శకుడు చరణ్ రాజ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు. యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం 2025 ఏప్రిల్ 10న విడుదల కానుంది.

Leave a comment

error: Content is protected !!