Shopping Cart 0 items - $0.00 0

శేఖర్ కమ్మలకు నో చెప్పిన మహేశ్ బాబు?

 

మ‌హేష్ బాబు , శేఖ‌ర్ క‌మ్ముల.. ఈ ఇద్ద‌రికీ ఉన్న ఇమేజ్‌లు చాలా డిఫ‌రెంట్‌. మ‌హేష్‌కున్న క‌మ‌ర్షియ‌ల్ స్టామినా ఇమేజ్‌ని బ‌ట్టి చూస్తే శేఖ‌ర్ క‌మ్ముల‌తో కాంబినేష‌న్ వ‌ర్క‌వుట్ కాదు. అయితే ఈ ఇద్ద‌రూ క‌లిసి ఒక సినిమా చేద్దామ‌ని ప్లాన్ చేసారు. స్టోరీ డిస్క‌ష‌న్స్ అయ్యాయి. మ‌హేష్ కు కూడా విప‌రీతంగా నచ్చేసింది. కానీ సినిమా మాత్రం వ‌ర్క‌వుట్ కాలేదు.శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో ఎంత కూల్‌గా టేకింగ్ వుంటుందో.. అంత ఎమోష‌న్స్‌ను ఎలివేట్ చేస్తాడు. రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు పూర్తి డిఫ‌రెంట్‌గా వుంటుంది. అలాంటిది బాక్సాఫీస్‌ని షేక్ చేసే మాస్ కింగ్ మ‌హేష్‌కి లైన్ చెప్పాడు. అది కూడా ప్యూర్ ల‌వ్ స్టోరీ. ఇలాంటి మూవీస్ చేసే రేంజ్ ఎప్పుడో దాటిపోయిన మ‌హేష్‌కి కూడా ఆ స్టోరీ బాగా నచ్చింద‌ట‌.అమెరికా అబ్బాయికి ప‌ల్లెటూరి అమ్మాయి కి మ‌ధ్య న‌డిచే ప్యూర్ ల‌వ్‌స్టోరీని రెడీ చేసాడ‌ట శేఖ‌ర్ క‌మ్ముల‌. యూత్‌ని క్లాస్‌ని మాస్‌ని బేల‌న్స్‌డ్‌గా అల‌రించే స్టార్ మ‌హేష్‌. అందుకే ఆయ‌న‌కు స్టోరీ వినిపించాడ‌ట‌. అది విని ఫిదా అయిపోయాడ‌ట మ‌హేష్ బాబు. కానీ మ‌హేష్ సినీ స్టార్ ఇమేజ్ పెర‌గ‌టం, క‌మ‌ర్షియ‌ల్ ఈక్వేష‌న్స్‌కి ఈ సినిమాకి లింక్ లేక‌పోవ‌డంతో ఈ కాంబినేష‌న్‌లో సినిమా వ‌ర్కవుట్ కాలేదు.అప్ప‌టికే కొన్ని క‌మిట్‌మెంట్స్ వుండ‌టంతో సినిమా చేయ‌లేన‌ని చెప్పాడ‌ట‌. దాంతో ఆ స్టోరీ మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ ద‌గ్గ‌ర‌కొచ్చింది. అదే వ‌రుణ్ సాయిప‌ల్ల‌విల ఫిదా మూవీ.

Leave a comment

error: Content is protected !!