Thug Life : లోకనాయకుడు కమల్ హాసన్, కళాత్మక దర్శకుడు మణిరత్నం కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న యాక్షన్ డ్రామా చిత్రం “థగ్ లైఫ్”. కమల్ , మణి కలయికలో 36 ఏళ్ల తర్వాత వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. జనవరిలో ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్ సగం పూర్తయింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతల్లో ఒకరైన శివ అనంత్ వెల్లడించారు.

“చిత్రం చాలా బాగా వస్తోంది. షూటింగ్ సగం పూర్తయింది. షూటింగ్ పూర్తయిన వెంటనే ప్రకటన తేదీని ఖరారు చేస్తాం. ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేము చాలా ఆసక్తిగా ఉన్నాం” అని శివ అనంత్ చెప్పారు. ఈ చిత్రంలో కమల్ హాసన్ రంగరాయ శక్తివేల్ నాయకర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో శింబు, త్రిష, జయం రవి, దుల్కర్ సల్మాన్, నాజర్, ఐశ్వర్య లక్ష్మి, సాన్య మల్హోత్రా, పంకజ్ త్రిపాఠి, రోహిత్ సారిఫ్, అలీ ఫజల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!