గురు రాఘవేంద్ర సమర్పణలో హరి వల్లభ ఆర్ట్స్ పతాకంపై దర్శకుడు ఆనంద్ కానుమోలు రూపొందించిన సినిమా ”తొంగి తొంగి చూడమాకు చందమామ”. ఈ చిత్రానికి ఎ. మోహన్ రెడ్డి నిర్మాత. దిలీప్, శ్రావణి హీరో హీరోయిన్ లుగా నటించారు. లవ్, రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
చిత్రం: తొంగి తొంగి చూడమకు చందమామ
సంగీతం – హరి గౌర
ఎడిటర్ – ఈశ్వర్ 57 సినిమాటోగ్రఫీ – వివేక్ రఫీ ఎస్కే
సాహిత్యం – బాలాజీ
ఆర్ట్ – రమేష్
కొరియోగ్రఫీ – శ్రీనివాస్, వినయ్
ఫైట్స్ – రియల్ సతీష్
నిర్మాత – ఎ. మోహన్ రెడ్డి
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం – ఆనంద్ కానుమోలు.
కథ:
నందు (దిలీప్) అల్లరి తట్టుకోలేని తన తల్లితండ్రులు తనని తన అక్క బావ ఉరికి పంపిస్తారు. అక్కడ అక్క, బావ ఇంట్లో ఉండే నందుకు వీణ (శ్రావణి) పరిచయం అవుతుంది. అలా పరిచయమైన వీరి స్నేహం ప్రేమగా మారుతుంది. అదే సమయంలో వీణను పెళ్లాడటనని తన బావ వెంటపడుతూ ఉంటాడు. ఈ క్రమంలో వీణ నందుకు మరింత దగ్గరవుతుంది. చివరికి వీరిద్దరూ ఎలా కలుసుకున్నారు ? వీణ బావ ఏమయ్యాడు వంటి విషయాలు తెలియాలంటే తొంగి తొంగి చూడమకు చందమామ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
అమ్మాయిలను వేధించే అబ్బాయిలకు ఈ సినిమాలో చక్కటి సందేశం ఉంది. నిజంగా ఒక అమ్మాయిని ప్రేమించాలి కానీ వారిని వాడుకొని వదిలేయకూడదని ఈ సినిమాలో చక్కగా చూపించడం జరిగింది. దిలీప్, శ్రావణి హీరో హీరోయిన్లుగా బాగా నటించారు. హీరో బావ పాత్రలో జెమిని సురేష్ బాగా నటించాడు. కుమార్ సాయి కామెడీ బాగుంది, హీరో ఫ్రెండ్ రోల్ లో కనిపించిన కుమార్ సాయి బాగా నవ్వించాడు. రాజ్ బాల, కార్తిక్, అపర్ణ, స్నేహల్, వింధ్యా రెడ్డి, అనంత్, లావణ్య తదితరులు వారి పాత్రల పరిధి మేరకు బాగా నటించి మెప్పించారు.
డైరెక్టర్ ఆనంద్ కానుమోలు ఎంచుకున్న కథ కథనాలు బాగున్నాయి. తాను రాసుకున్న కథను తెరమీద అద్భుతంగా తెరకెక్కించారు. ఎక్కడా బోరింగ్ లేకుండా సరదాగా సినిమా సాగుతుంది. ముఖ్యంగా చివరి 20 నిముషాలు సినిమా అత్యంత ఆసక్తికరంగా ఉంది. నిర్మాత ఏ.మోహన్ రెడ్డి ఎక్కడా ఖర్చుకు రాజీ పడకుండా గ్రాండ్ గా తీసాడు. సినిమా ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. హరి గౌర పాటలతో పాటుగా నేపధ్య సంగీతం బాగుంది. ఎడిటర్ ఈశ్వర్ పనితనం బాగుంది. ఫైట్స్ రియల్ సతీష్ యాక్షన్ ఎపిసోడ్స్ రియలిస్టిక్ గా ఉన్నాయి. కథలో సందర్బంగా వచ్చే పాటలకు బాలాజీ లిరిక్స్ బాగా కుదిరాయి. వివేక్ రఫీ కెమెరా వర్క్ బాగుంది. ‘మన ఇష్టాల్లో మనం మాత్రమే ఉంటాం. కానీ ఆడవాళ్ళ ఇష్టాల్లో మనం కూడా ఉంటాం’ అని జెమినీ సురేష్ చెప్పే డైలాగ్ బాగుంది. ఇలా చాలా డైలాగ్స్ ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి.
తొంగి తొంగి చూడమకు చందమామ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. ముఖ్యంగా యువతకు కావాల్సిన అంశాలు ఈ సినిమాలో బాగున్నాయి. సరదాగా సాగే ఈ ప్రేమ కథకు అందరూ కనెక్ట్ అవుతారు. ఈ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ ను అందరూ చూసి ఎంజాయ్ చెయ్యవచ్చు. ఇంటర్వెల్ ట్విస్ట్, ఆలోచింపజేసే క్లైమాక్స్, మన చుట్టూ ప్రతిరోజు చూస్తున్న పాత్రలు ఇలా ప్రతీది సినిమా చేస్తున్నంతసేపు మనకు కనెక్ట్ అవుతుంది.
చివరిగా: చక్కటి సందేశం ఉన్న తొంగి తొంగి చూడమకు చందమామ అలరిస్తుంది
రేటింగ్: 3