Venky – Anil combo : విక్టరీ వెంకటేష్ , సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మళ్లీ కలిసి సినిమా చేస్తున్నారనే సంగతి తెలిసిందే. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మించనుండగా, దిల్ రాజు సమర్పిస్తున్నారు. శిరీష్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి హ్యాట్రిక్ హిట్ ఖాయం అని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. “ఎఫ్2” అండ్ “ఎఫ్3” చిత్రాలతో బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్న ఈ కాంబినేషన్ తో సినిమాపై ఆసక్తి పెరుగుతోంది.

ఈ చిత్రం పూజా కార్యక్రమం లేటెస్ట్ గా హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ప్రముఖ నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్ పాల్గొన్నారు. సురేష్ బాబు కెమెరా స్విచ్ ఆన్ చేయగా, అల్లు అరవింద్ క్లాప్ బోర్డ్ పట్టారు. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి స్క్రిప్ట్ అందించగా, రాఘవేంద్ర రావు గౌరవ దర్శకత్వం వహించారు. ఇది ట్రైయాంగులర్ క్రైమ్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. విక్టరీ వెంకటేష్ తో పాటు ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి మరియు ఐశ్వర్య రాజేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం 2025 సంక్రాంతికి విడుదల కానుంది.

Leave a comment

error: Content is protected !!