Thug Life : లోకనాయకుడు కమల్ హాసన్, మణిరత్నం కలయికలోని రెండో సినిమా  థగ్ లైఫ్. నాయకుడు తర్వాత ఈ ఇద్దరి కాంబోలోని సినిమా కావడంతో పాటు ఇది కమల్ హాసన్ 234వ చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

ఇప్పటికే విడుదలైన ‘సిగ్మా థగ్ రూల్’ టీజర్ తో శింబు పాత్ర పై భారీ ఆసక్తి నెలకొంది. తాజా సమాచారం ప్రకారం, షూటింగ్ ప్రస్తుతం పాండిచ్చేరి ఎయిర్‌పోర్టులో జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో కమల్ హాసన్, శింబు, అశోక్‌సెల్వన్ పై వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. గ్యాంగ్‌స్టర్‌ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రంలో భారీ యాక్షన్ సీక్వెన్స్ లు ఉండబోతున్నాయి.

ఆస్కార్ విజేత ఏఆర్‌ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. కమల్ హాసన్-ఆర్ మహేంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కమల్ హాసన్‌-ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్‌, రెడ్ జియాంట్ మూవీస్‌, మద్రాస్ టాకీస్‌ బ్యానర్లపై తెరకెక్కిస్తోంది. కొన్ని రోజుల క్రితం ఢిల్లీలోని సంకట్‌ మోచన్‌ హనుమాన్‌ మందిర్‌లో జరిగిన షూటింగ్‌ స్టిల్స్‌ ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. థగ్ లైఫ్ టీంతో డిజైన్ చేసిన వీడియో కూడా ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రం ఈ ఏడాది చివరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a comment

error: Content is protected !!