Bollywood : బాలీవుడ్‌ నటుడు విక్రాంత్ మాస్సే తన కొత్త సినిమా ‘ది సబర్మతీ రిపోర్ట్’ ద్వారా గోద్రా రైలు దహనం అనే చారిత్రాత్మక సంఘటనపై కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాడు. ఈ సినిమాలో గోద్రా రైలు దహనం ఒక అనుకోని సంఘటన కాదని, దాని వెనక ప్రపంచానికి తెలియని ఎన్నో రహస్యాలున్నాయని ఆయన తెలిపారు. 2002 ఫిబ్రవరి 27న జరిగిన గోద్రా రైలు దహనం దేశాన్ని కలచివేసిన సంఘటన. ఈ దహనంలో 59 మంది ప్రాణాలు కోల్పోయారు. ‘ది సబర్మతీ రిపోర్ట్’ మూవీ ఈ దహనం వెనుక ఉన్న నిజాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తోంది.

విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా ఈ సినిమాలో పాత్రికేయులుగా నటిస్తున్నారు. వీరు ఈ దహనం వెనుక ఉన్న రహస్యాలను వెతుకుతూ, ఒక పెద్ద కుట్రను బయటపెడతారు. సినిమా టీజర్‌లో, “దేశ చరిత్రను మార్చిన సంఘటన.. భవిష్యత్తును మార్చిన పరిణామాలు. సత్యాన్ని గగ్గోలు పెట్టిస్తూ  భయపెట్టొచ్చు. కానీ.. ఓడించలేము” అనే సంభాషణ ఈ కుట్ర యొక్క తీవ్రతను తెలియజేస్తుంది. ఈ

Leave a comment

error: Content is protected !!