నటీనటులు – రాజ్ భీమ్ రెడ్డి, జరా ఖాన్, చమ్మక్ చంద్ర, ముక్తార్ ఖాన్, రామరాజు, సమీర్, సీవీఎల్ నరసింహారావు, అనంత్ తదితరులు
టెక్నికల్ టీమ్ – ఎడిటర్ – జేపి, మ్యూజిక్ – సందీప్ కనుగుల, డీవోపీ – నిమ్మల జైపాల్ రెడ్డి, స్టంట్ – శంకర్, ఆది, కో ప్రొడ్యూసర్ – కమల్ హాసన్ పాత్రుని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – జానకి రామ్ పమరాజు, ప్రొడ్యూసర్ – రాజ్ భీమ్ రెడ్డి, దర్శకత్వం – ఆర్ రాజశేఖర్ రెడ్డి.

రాజ్ భీమ్ రెడ్డి, జరా ఖాన్ జోడీ గా నటించిన ఇండియన్ స్టోరి సినిమా నేడు థియేటర్స్ లోకి వచ్చింది. మన సమాజంలోని ఒక సమస్యను బేస్ చేసుకొని ఈ సినిమా తెరకెక్కింది. ది భీమ్ రెడ్డి క్రియేషన్స్ బ్యానర్ పై రాజ్ భీమ్ రెడ్డి నిర్మిస్తూ ఆయనే హీరోగా నటించారు. ఆర్ రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. మరి ఈ సినిమా జనానికి ఏ మేరకు కనెక్ట్ అయిందో రివ్యూలో చూద్దాం.

కథ
హిందువుల వర్గానికి లీడర్ శ్రీరామ్ (రామరాజు), ముస్లిం కమ్యూనిటికీ నాయకుడు కబీర్ ఖాన్ (ముక్తార్ ఖాన్). వీరిద్దరూ ప్రజల్ని రెచ్చగొడుతూ పరస్పరం దాడులు చేసుకునేలా చేస్తుంటారు. వైజాగ్ నుంచి వచ్చిన రెహమాన్ (రాజ్ భీమ్ రెడ్డి)కి ఓ విషయంలో ఫేకు (చమ్మక్ చంద్ర) అనే స్నేహితుడు సాయం చేస్తానంటూ మోసం చేసే ప్రయత్నం చేస్తాడు. కబీర్ ఖాన్ ను శ్రీరామ్ వర్గం చేసిన హత్యాయత్నం నుంచి రెహమాన్ కాపాడతాడు. కబీర్ ఖాన్ ప్రోద్బలంతో అతని వర్గంలో రెహమాన్ చేరతాడు. స్నేహితుడిగా మారిన రెహమాన్ ను కబీర్ ఖాన్ హత్య చేయాలని భావిస్తాడు . ఇందుకు కారణం ఏంటి. జర్నలిస్ట్ రాజ్ రెహమాన్ గా ఎందుకు మారాడు? ఆయేషాతో రెహమాన్ ప్రేమ సక్సెస్ అయ్యిందా లేదా. మతం పేరుతో ప్రజల్ని విడదీసిన ఈ ఇద్దరు లీడర్స్ నేపథ్యం ఏంటి? కబీర్ ఖాన్, శ్రీరామ్ పుట్టించే మత విద్వేషాల నుంచి సమాజాన్ని రెహమాన్ ఉరఫ్ రాజ్ ఎలా కాపాడాడు అనేది మిగిలిన కథ.

విశ్లేషణ
రాజకీయాలు, రాజకీయ నాయకుల స్థితిగతులు అంత తేలిగ్గా అర్ధం కావు. మీడియా ముందు ఒకరినొకరు దూషించుకుంటూ బద్ధ శత్రువులుగా కనిపించిన నేతలు ప్రైవేట్ పార్టీల్లో కలిసి సరదాగా గడుపుతుంటారు. వాళ్ళు నవ్వుతూ మాట్లాడుకోవడం చూసి జనాలు ఆశ్చర్యపోతారు. ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. రాజకీయ నాయకులు స్వార్థం, మతం పేరుతో మనుషుల మధ్య విభేదాలు సృష్టించకుండా జాగ్రత్త పడాలని ఇండియన్ స్టోరీ సినిమా మంచి సందేశాన్ని ఇచ్చింది.

కబీర్ ఖాన్, శ్రీరామ్‌ల పరిచయంతో సినిమా ప్రారంభమవుతుంది. వైజాగ్‌కు చెందిన రామన్ (కథానాయకుడు రాజ్ భీమ్ రెడ్డి) అతని స్నేహితుడు ఫేక్ (చమక్ చంద్ర)ని కలుసుకోవడం, వారిద్దరూ బంగారు బిస్కెట్లు అమ్మడానికి వెళ్ళినప్పుడు సినిమా ఫన్నీ నోట్‌తో ప్రారంభమవుతుంది. కబీర్ ఖాన్‌ను రెహమాన్ హత్య నుండి రక్షించడంతో సినిమాలో సీరియస్‌నెస్ ప్రారంభమవుతుంది. చమ్మక్ చంద్ర , ఒక నర్సు లపై కామెడీ, ప్రధాన పాత్ర రాజ్ భీమ్ రెడ్డి , చమ్మక్ చంద్ర మధ్య సన్నివేశాలు నవ్వు తెప్పిస్తాయి.
హీరో, హీరోయిన్ల మధ్య ఒక చిన్న హృద్యమైన ప్రేమ కథ కూడా ఉంటుంది. మాజీ జర్నలిస్ట్ రాజ్ రెహమాన్ గా ఎందుకు మారాడు? అనేది ఆసక్తికరంగా చూపించాడు దర్శకుడు. అలాగే .. కామెడీగా ఉంటూనే కథలోని సీరియస్‌నెస్‌ని అలాగే ఉంచాడు. నిర్మాత-దర్శకుడు రాజ్ భీమ్ రెడ్డి ఈ సినిమాతో చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే, మతం పేరుతో ప్రజలకు తప్పుడు సందేశాలు పంపకూడదు. మతం పేరుతో మన మధ్య విబేధాలు సృష్టించే వ్యక్తుల కుట్రల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనే మంచి సందేశాన్ని ఈ సినిమా ఇచ్చింది.

హీరో నటన బాగుంది. యాక్షన్ సీక్వెన్స్‌లు బాగా చిత్రీకరించారు. ఫేక్‌గా చమ్మక్ చంద్ర కెరీర్‌లో బెస్ట్ క్యారెక్టర్‌లలో ఇదొకటి. హీరోయిన్‌గా జారా ఖాన్ నటన కూడా బాగుంది. శ్రీరామ్‌గా రామరాజు, కబీర్‌ఖాన్‌గా ముఖ్తార్‌ఖాన్‌ తమ తమ పాత్రల్లో అత్యుత్తమంగా నటించారు. టెక్నికల్ పరంగా చూస్తే “ది ఇండియన్ స్టోరీ ” సినిమా ఆకట్టుకుంటుంది.

గమనిక : ఈ రివ్యూ క్రిటిక్ అభిప్రాయం మాత్రమే

Leave a comment

error: Content is protected !!