యథార్ధ ఘటనలను సినిమాగా తీయడం ఎప్పటినుంచో ఉన్నదే. సంఘటన తాలూకూ ఎమోషన్‌ను స్టార్ట్‌ టు ఎండ్ క్యారీ చేస్తేనే ఆ సినిమాలకు ఆదరణ ఉంటుంది. అలాంటి యథార్ధ ఘటనతో రామ్‌ కార్తీక్‌,హెబా పటేల్‌ జంటగా.. విప్లవ్‌ కోనేటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ది గ్రేట్‌ ఇండియన్‌ సూసైడ్‌‘. ఆహా ఓటీటీలో అక్టోబర్ 6న రిలీజైన ఈ సినిమా హిట్టా ఫట్టా ఈ రివ్యూలో చూద్దాం.

కథ :
స్నేహితుడితో కాఫీషాప్‌ బిజినెస్ చేస్తుంటాడు హేమంత్‌ (రామ్‌ కార్తీక్‌). అతని షాప్కు కుకీస్ సప్లై చేసే అమ్మాయి చైత్ర. ఆ పరిచయంలో చైత్రపై హేమంత్ కు ప్రేమ కలుగుతుంది. ప్రపోజ్‌ చేస్తాడు.. కానీ చైత్ర నో చెప్తుంది. కొద్ది రోజుల్లో తమ కుటుంబమంతా సూసైడ్ చేసుకోబోతున్నట్టు చెప్పి షాకిస్తుంది. తన పెదనాన్న బళ్లారి నీలకంఠయ్య (వీకే నరేష్)ను బ్రతికించుకోవాలంటే తాము సూసైడ్ చేసుకోవాలని చెప్పి షాకిస్తుంది. చైత్రను సేవ్ చేయాలనుకున్న హేమంత్‌ ఆమెను పెళ్లి చేసుకుని వాళ్లింట్లో అడుగుపెడతాడు. హేమంత్ వారి కుటుంబాన్ని సేవ్ చేసాడా లేదా అన్నది సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ: చిత్తూరు జిల్లా మదనపల్లె లో జరిగిన సంఘటనను స్పూర్తిగా తీసుకుని చేసిన చిత్రం. ఆ మాటకొస్తే ఇలాంటి సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి. నమ్మకానికి మూఢనమ్మకానికి ఉన్న సన్నని గీతను చెప్పే ప్రయత్నం ఇది. నమ్మకస్తుల చేతుల్లో చిన్నారులు లైంగిక దాడులకు గురవుతున్నారన్న నిజాన్ని, స్వామీజీల అవతారంలో జరిగే ఎన్నో ఆకృత్యాలను ఈ చిత్రం కళ్లకు కట్టే ప్రయత్నం చేస్తుంది.

హేమంత్ లవ్‌స్టోరీగా మొదలై ఊహించని సన్నివేశాలతో సాగే స్క్రీన్‌ప్లే థ్రిల్ చేస్తుంది. చైత్ర ఇంట్లో జరిగే మిస్టరీని ఛేదించే క్రమంలో రివీల్ అయ్యే ట్విస్ట్‌లు ఉత్కంఠతకు గురి చేస్తాయి. నచ్చితే నమ్మకం.. నచ్చకపోతే మూఢనమ్మకం అంటూ సాగే డైలాగ్స్‌ ఆకట్టుకుంటాయి. విప్లవ్‌ కోనేటి స్క్రీన్‌ ప్లే ఆద్యంతం థ్రిల్‌ చేస్తుంది. అంతేకాదు పార్ట్‌ 2 ఉన్నట్టు హింట్‌ ఇస్తూ సినిమాను ముగించిన విధానం కూడా బాగుంది.

నటీనటులు:

హేమంత్‌ గా రామ్‌ కార్తీ అద్భుతంగా నటించాడు. హెబ్ పటేల్‌ నటనలో వేరియేషన్స్‌ బాగా చూపించింది. నరేష్, పవిత్ర లోకేష్ ఇతర పాత్రధారుల తమ పాత్రలకు న్యాయం చేసారు.

టెక్నికల్‌ టీమ్:

విప్లవ్‌ కోనేటి రాసుకున్న కథకి అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో ప్రజెంట్ చేయడంలో సక్సెస్‌ అయ్యాడు. స్క్రీన్‌ప్లేతో మ్యాజిక్ చేసాడనే చెప్పాలి. కల్ట్‌ సూసైడ్ అనే కాన్సెప్ట్‌ను ప్రజెంట్ చేయడంలో సక్సెస్‌ అయ్యాడు దర్శకుడు. కాకపోతే కథలో ఎంటరవడానికి చేసిన సాగతీత కొంతమేరకు ఇబ్బంది పెడుతుంది. ఈ సినిమాకు ప్రధాన బలం శ్రీచరణ్‌ పాకాల సంగీతం. బడ్జెట్ తక్కవే అయినా సినిమా చాలా క్వాలిటీ ఔట్‌ పుట్‌ ఇవ్వడంలో సక్సెస్‌ అయ్యారు.

బోటమ్‌ లైన్‌ : గ్రేట్‌ థ్రిల్‌నిచ్చే గ్రేట్‌ ఇండియన్‌ సూసైడ్

రేటింగ్ : 3.25 / 5

Leave a comment

error: Content is protected !!