సైన్స్‌కి లాజిక్‌ కి అందకుండా ఏదో జరుగుతుంది.. చనిపోయిన వ్యక్తిని బ్రతికించుకునేందుకు అశాస్త్రీయమైన ప్రయత్నం. ఓ ఆత్మ కోసం 8 మంది ఆత్మహత్య.. వింటుంటే ఒళ్లు జలదరిస్తుంది కదా. మదనపల్లెలో జరిగిన యథార్ధ ఘటనకు థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లేతో ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశాలతో రాబోతుంది ది గ్రేట్‌ ఇండియన్‌ సూసైడ్‌‘. రిలీజైన ట్రైలర్‌తోనే ఆహా అనిపించిన ఈ ఓటీటీ ఫిల్మ్‌ అక్టోబర్‌ 6 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సందర్భంగా ప్రెస్‌మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్‌.

హెబాపటేల్‌, రామ్‌ కార్తీక్‌ , వీకె నరేష్, పవిత్ర లోకేష్‌ , జయప్రకాశ్‌ మెయిన్‌ లీడ్ చేస్తున్న ఈ మూవీ ఆహాలో అక్టోబర్‌ 6 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. హెబా పటేల్ ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్‌తో పోల్చితే.. ఈ సినిమా చాలా డిఫరెంట్ గా ఉంటుంది, హీరో రామ్‌ కార్తీక్‌.. మిగతా క్యారెక్టర్స్ డామినేట్ చేయకుండా తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు.. వీకె నరేష్ గారు తక్కువ సీన్స్‌తోనే ఎక్కువ ఇంపాక్ట్‌ క్రియేట్ చేసారు.. పవిత్ర లోకేష్ గారి క్యారెక్టర్‌ హైలైట్‌.. ఇలాంటి లేడీస్‌ నిజంగా బయట ఉన్నారా అన్నంతగా ఆ పాత్ర పోషించారు.. ఈ సినిమా ఖచ్చితంగా సీట్‌ ఎడ్జ్‌ థ్రిల్‌ ఇస్తుందన్నారు దర్శక నిర్మాత విప్లవ్‌ కోనేటి. సిరంజ్‌ మూవీస్‌ , KSV సమర్పణలో ఈ సినిమా రూపొందింది.

Leave a comment

error: Content is protected !!