Ready to Release : ఒకప్పటి హాస్యనటుడు, అద్భుతమైన ఇంద్రజాలికుడు అయిన లెజెండరీ యాక్టర్ తిక్కవరపు రమణారెడ్డి.. జీవిత విశేషాలకు సంబంధించి ఇంతవరకూ సరైన సమాచార గ్రంథం ఎక్కడా లేదనే చెప్పాలి. అయితే ఆ లోటును భర్తీ చేసే ఉద్దేశంతో మూవీ వాల్యూమ్ అథినేత జీలాన్ బాషా రంగంలోకి దిగారు. ఈయన ఇంతకు ముందు జానపద బ్రహ్మ విఠలాచార్యపై జై విఠలాచార్య అనే పుస్తకాన్ని విడుదల చేయగా.. దానికి అనూహ్య స్పందన లభించింది. ఇప్పుడు రెండో ప్రయత్నంగా లెజెండరీ కమెడియన్ రమణారెడ్డిపై .. ‘నవ్వుల మాంత్రికుడు’ అనే పుస్తకాన్ని త్వరలోనే విడుదల చేయబోతున్నారు.

ఉదయగిరి ఫయాజ్ రాసిన ఈ పుస్తకంలో రమణారెడ్డి జీవిత విశేషాల్ని ఆకర్షణీయమైన ఫోటోస్ తో పాఠకలోకానికి అందించబోతున్నారు. గతేడాది కమెడియన్ ఆలీ ఈ పుస్తకం ఫస్ట్ లుక్ ను తన నివాసంలో విడుదల చేశారు. రమణారెడ్డి జీవితంలోని మేలిమి ఘట్టాలకు అక్షర రూపం ఇస్తుంది ఈ పుస్తకం. ఆకట్టుకొనే కవర్ పేజ్ తో.. నలుపు తెలుపురంగుల మేలి కలయికతో ఈ పుస్తకం అందుబాటులోకి రాబోతోంది.

Leave a comment

error: Content is protected !!