Thangalan : కోలీవుడ్ లోనే అత్యంత ఎదురుచూస్తున్న చిత్రాలలో ‘తంగలాన్’ ఒకటి. చియాన్ విక్రమ్ నటించిన ఈ ప్రయోగాత్మక పీరియాడిక్ యాక్షన్ డ్రామాను టాలెంటెడ్ డైరెక్టర్ పా రంజిత్ తెరకెక్కించాడు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం తాజాగా రిలీజ్ డేట్ ను లాక్ చేసుకుంది. ‘తంగలాన్’ చిత్రాన్ని ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. రొటీన్  ట్రాక్‌కు భిన్నంగా రూపొందించిన టీజర్, ట్రైలర్లు ఈ చిత్రంపై భారీ అంచనాలను నెలకొల్పాయి. విక్రమ్ ట్రైబల్ లుక్ లో కనిపించడం ఈ చిత్రానికి మరింత హైలైట్ గా నిలిచింది.

సామాజిక న్యాయం, రాజకీయ అంశాలతో కూడిన కథాంశాలకు పేరుగాంచిన దర్శకుడు పా రంజిత్ ఈ చిత్రంతో బాక్సాఫీస్ దుమ్ము రేపుతాడని అందరూ ఆశిస్తున్నారు. మాళవిక మోహనన్, పార్వతి తిరువోతు, పశుపతి తదితర నటీనటులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటించారు. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్, జియో స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.

 

Leave a comment

error: Content is protected !!