Thandel : అక్కినేని నవ యువ సామ్రాట్ నాగచైతన్య , లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి జోడీగా నటిస్తున్న చిత్రం ‘తండేల్‌’. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బన్నీ వాస్‌ నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్‌ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ రామోజీ ఫిల్మ్‌ సిటీలో జోరుగా సాగుతోంది. ప్రధాన తారాగణంపై కీలకమైన టాకీ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో నాగచైతన్య, సాయిపల్లవి డీగ్లామర్‌ పాత్రల్లో నటిస్తున్నారు.

పాత్రలు, వేషం, సంభాషణలు అత్యంత సహజంగా ఉండేలా రూపొందిస్తున్నారు. భారీ హంగులతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇదిలా ఉంటే.. విరాటపర్వం’, ‘గార్గి’ చిత్రాల్లో నటనకుగానూ ఉత్తమ నటిగా రెండు ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారాల్ని సొంతం చేసుకున్నారు కథానాయిక సాయిపల్లవి. ఈ సందర్భంగా ఆమెను ‘తండేల్‌’ సినిమా సెట్లో ఆ చిత్రబృందం సత్కరించింది.

Leave a comment

error: Content is protected !!