Thammudu : శ్రీరామ్ వేణు దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన “తమ్ముడు” చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో వర్ష బొల్లమ్మ, లయ, స్వస్విక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌ సిటీలో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో భాగంగా, చిత్రబృందం ఒక వారం పాటు నితిన్‌తో పాటు మిగిలిన నటీనటులపై పోరాట సన్నివేశాలను చిత్రీకరించనుంది.

ఈ యాక్షన్ సీక్వెన్స్‌కు నేతృత్వం వహించే బాధ్యత “కేజీఎఫ్‌ 1”, “కాంతార” సినిమాలకు ఫైట్‌ మాస్టర్‌గా పనిచేసిన విక్రమ్‌ మోర్‌కు దక్కింది. “తమ్ముడు” ఒక యాక్షన్ డ్రామా చిత్రం, ఇందులో అన్ని వాణిజ్య హంగులతో కూడిన సన్నివేశాలు ఉండనున్నాయని చిత్రబృందం తెలిపింది. “ఈ చిత్రంలో మూడు భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండనున్నాయి, ఇవి సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి” అని దర్శకుడు మరియు నిర్మాతలు వెల్లడించారు. “తమ్ముడు” చిత్రం విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు.

Leave a comment

error: Content is protected !!