gunturukaaram : ఆ మధ్య తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక డైలాగ్ తెగ ట్రెండింగ్ అయింది. ఒక ముసలి తాత ఆవేశంతో కుర్చీ మడత పెట్టి అంటూ.. ఒక బూతు డైలాగ్ చెప్పాడు. అది ఎంత ఫేమస్ అయిందంటే.. దాని పై మీమ్స్ , రీల్స్ , షాట్స్ , స్కిట్స్ చేసేంతగా ఫేమస్ అయింది. అయితే అది అక్కడితో ఆగలేదు. ఒక స్టెప్ ముందుకేసి మహేశ్ బాబు , త్రివిక్రమ్ కాంబో మూవీ గుంటూరు కారం సినిమాలో అదే పల్లవిగా ఒక పాట రాసే వరకూ వచ్చింది. ఆ ముసలి తాత వాయిస్ నే తీసుకొని తమన్ సంగీత దర్శకత్వంలో రామజోగయ్య శాస్త్రి పక్కా జానపద పదాలతో మాస్ సాంగ్ గా దీన్ని తీర్చిదిద్దారు. అయితే తమన్ అక్కడితో ఆగలేదు. ఆ పల్లవికి అసలు కారకుడైన ఆ ముసలితాతను పిలిచి లక్షల రూపాయలు ఆర్ధిక సహాయం కూడా చేశాడు. ఆర్ టీవీ వారు 5 వేలు ఇచ్చారు. దాంతో ఆ వృద్ధ ప్రాణం కృతజ్ఞతతో ఉబ్బితబ్బి బ్బవుతోంది. తనను వైజాగ్ సత్య అనే ఆయన తమన్ దగ్గరకు తీసుకెళ్ళాడని.. తనను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపాడు. ఆ డబ్బుల్ని తన సొంతానికే ఉపయోగించుకుంటున్నానని, దయచేసి ఎవరి మాటలు వినొద్దని .. తన గురించి తప్పుడుగా ప్రచారం చేసి తన పరువు తీయొద్దని వినయంగా వేడుకున్నాడు.