చిత్రం : తలవన్
స్ట్రీమింగ్ తేదీ : సెప్టెంబర్ 9, 2024
ఓటీటీ ప్లాట్ ఫామ్ : సోనీలివ్
నటీనటులు : బిజుమీనన్, అసిఫ్ ఆలీ, బిజు మీనన్, మియా జార్జ్, అనుశ్రీ, జాఫర్ ఇడుక్కి తదితరులు
సినిమాటోగ్రఫీ: శరన్ వేలాయుధన్
దర్శకత్వం : జిస్ జాయ్

Thalavan movie OTT review : మలయాళ సినిమా పరిశ్రమ క్రైమ్ థ్రిల్లర్లకు పెట్టింది పేరు. తాజాగా ఈ జాబితాలో చేరిన సినిమా ‘తలవన్’. టాలెంటెడ్ యాక్టర్ బిజు మీనన్, యూత్ స్టార్ ఆసిఫ్ అలీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, ఓటీటీ వేదికగా ఈ నెల 9న సోనీలివ్‌లో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ఎలా ఉంది? ఏ రేంజ్ లో థ్రిల్ చేస్తోంది అనే విషయాలు రివ్యూలో తెలుసుకుందాం.

కథాంశం
‘తలవన్’ నిజ జీవిత సంఘటనల నుండి స్ఫూర్తి పొందిన కథ. ఒక పోలీస్ స్టేషన్‌లో పని చేసే ఇద్దరు అధికారుల మధ్య జరిగే సంఘర్షణ.. ఒక హత్య కేసు చుట్టూ తిరుగుతుంది. ఆసిఫ్ అలీ పోషించిన కార్తీక్ పాత్ర, బిజు మీనన్ పోషించిన జయశంకర్ పాత్రకు ఎదురుగా నిలుస్తుంది. వీరిద్దరి మధ్య ఉన్న విభేదాలు, ఒక హత్య కేసులో ఎలా పెనవేసుకుంటాయి అనేది కథాంశం.

విశ్లేషణ
తలవన్ కథ కొత్తదనం లేనప్పటికీ, దర్శకుడు జిస్ జాయ్ ఈ కథను ఎంతో ఆసక్తికరంగా తెరకెక్కించాడు. బిజు మీనన్ , ఆసిఫ్ అలీల నటన ఈ సినిమాకు ప్రాణం పోసింది. ముఖ్యంగా ఆసిఫ్ అలీ.. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను అలరించాడు.

సినిమా మొదటి భాగంలో కొంత నెమ్మదిగా సాగినప్పటికీ, రెండవ భాగంలో కథ వేగంగా సాగుతుంది. హత్య కేసు విచారణలో బిజు మీనన్ పాత్ర ఎలా ఇరుక్కుంటుంది? ఆసిఫ్ అలీ ఈ కేసును ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తాడు అనే అంశాలు ప్రేక్షకులను ఆసక్తిగా కూర్చోబెడతాయి.

సినిమాలో కొన్ని తార్కిక లోపాలు కనిపించినప్పటికీ, మొత్తం మీద ‘తలవన్’ ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్. ఈ సినిమాలో ప్రతీకారం, న్యాయం వంటి అంశాలను చాలా సున్నితంగా చిత్రీకరించారు. కుటుంబ సమేతంగా ఆనందించేలా ఈ సినిమాను తీర్చిదిద్దారు.

నటీనటుల పెర్ఫార్మెన్స్
బిజు మీనన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. అనుభవజ్ఞుడైన నటుడిగా తన నటనతో ఆకట్టుకున్నాడు. ఆసిఫ్ అలీ కెరీర్‌లో మరో మైలురాయిగా ఈ సినిమా నిలిచిపోతుంది. అతని పెర్ఫార్మెన్స్ కూడా అందుకు తగ్గట్టుగానే ఉంది. మిగతా నటవర్గం కూడా తమ పాత్రలకు తగిన న్యాయం చేశారు.

మొత్తం మీద ‘తలవన్’ ఒక సాధారణ కథతో తెరకెక్కినప్పటికీ , నటన, దర్శకత్వం కథనం ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రమైంది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమాను తప్పకుండా చూడవచ్చు. సోనీలివ్‌లో ఈ సినిమా మలయాళం, తెలుగు, తమిళ, హిందీ, మరాఠీ, బెంగాలీ, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది.
బోటమ్ లైన్ : నంబర్ వన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్
రేటింగ్ : 3.5 /5

Leave a comment

error: Content is protected !!