Thalapathi Vijay : తమిళ దళపతి విజయ్‌ తన కెరీర్‌లో చివరి సినిమాకు సైన్ చేశాడు. ఈ సినిమాను ప్రతిష్టాత్మకమైన KVN ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్నారు. అధికారికంగా టైటిల్‌ ప్రకటించకపోయినా, ఈ సినిమా గురించి అధిక ఆసక్తి నెలకొంది. ఇది విజయ్ కెరీర్ లో 69వ చిత్రం. ఇప్పుడు మేకర్స్‌ ఈ సినిమా గురించి మరో అప్‌డేట్‌ ఇచ్చారు.

‘దళపతి 69’ అక్టోబర్‌ 2025 లో తమిళ, తెలుగు, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదలవుతుంది. ఇది KVN ప్రొడక్షన్స్ వారి మొట్టమొదటి పాన్‌ ఇండియా వెంచర్. ఈ భారీ ప్రాజెక్టుకు ‘దీరన్ అదిగారం ఒండ్రు, నేర్కొండ పార్వై, తెగింపు చిత్రాల దర్వకుడు హెచ్. వినోద్ దర్శకత్వం వహించబోతున్నాడు.

విజయ్‌కు ఎన్నో చార్ట్‌బస్టర్‌ ఆల్బమ్‌లు ఇచ్చిన రాక్ స్టార్ అనిరుధ్‌ రవిచందర్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. జగదీశ్‌ పలనిసామి, లోహిత్‌ ఈ సినిమాను కో-ప్రొడ్యూస్‌ చేస్తున్నారు. ఈ ప్రకటన విజయ్‌ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ ప్రకటన సందర్భంగా KVN ప్రొడక్షన్స్ విడుదల చేసిన పోస్టర్‌ విజయ్‌ చివరి సినిమా గాఆసక్తిని రేకెత్తిస్తోంది. KVN ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్‌ కె. నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!