Thalapathi Vijay : తమిళ టాప్ హీరో దళపతి విజయ్ ప్రస్తుతం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ‘ మూవీతో ప్రేక్షకులను ఎంటర్ టెయిన్ చేయడానికి చేయడానికి సిద్ధమవుతున్నాడు. దీని తర్వాత హెచ్. వినోద్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతున్నట్టు సమాచారం. రాజకీయ కథాంశంతో ప్రారంభమయ్యే ఈ సినిమాలో విజయ్‌కు జంటగా ఎవరు నటిస్తారనే నిన్నటి వరకు ఉత్కంఠ ఉన్నప్పటికీ, అందాల సమంత పేరు పెద్దగా వినిపిస్తోంది.

వీరిద్దరూ గతంలో మూడు సినిమాల్లో కలిసి నటించగా, అన్నీ మంచి విజయాన్ని సాధించాయి. ఇప్పుడు నాలుగో సారి నటిస్తుండడంతో అభిమానులు బాగా ఖుషీ అవుతున్నారు. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించనున్నట్లు సమాచారం. మరోవైపు, సమంత ‘సిటాడెల్: హనీ-బన్నీ’ … ఇంకా ‘మా ఇంటి బంగారం’ వంటి ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

Leave a comment

error: Content is protected !!