ఒకవైపు నిన్న ప్రకటించిన 67వ జాతీయస్థాయిలో ఉత్తమనటిగా అవార్డు పొందిన ఆనందం… మరోవైపు కంగనారనౌత్ పుట్టినరోజున పవర్ఫుల్ ‘తలైవి’ ట్రైలర్ మూడు భాషల్లో విడుదల.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, సినీనటి జయలలిత బయోపిక్ ‘తలైవి’లో కంగనా ప్రధానపాత్ర పోషిస్తుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచుతుంది.
‘మహా భారతంలో కూడా ద్రౌపదికి ఇదే జరిగింది. తన చీరను లాగి అవమానపరిచిన కౌరవుల కథ ముగించి, జడ ముడేసుకుని తన శపథాన్ని నేరవేర్చుకుంది. ఆ మహాభారతానికి ఇంకో పేరుంది..? అదే ‘జయ’ అంటూ కంగనా చెబుతున్న డైలాగ్ సినిమా ఏ రేంజ్లో ఉండనుందో చెప్పకనే చెబుతోంది. ముఖ్యంగా కేఎల్ విజయ్ టేకింగ్.. జి.వి ప్రకాష్ ఇచ్చిన నేపథ్య సంగీతం సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లింది.
ప్రకాష్‌రాజ్, అరవిందస్వామి, జిషు సేన్‌గుప్తా కీలకపాత్రల్లో నటిస్తున్నారు. విబ్రి పతాకంపై విష్ణువర్థన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఏప్రిల్ 23న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.