Temper Vamshi : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “దేవర” సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ పాన్ ఇండియా చిత్రం సెప్టెంబర్ 27, 2024న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ , ఫియర్ సాంగ్ ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఈ చిత్రంలో టెంపర్ ఫేమ్ వంశీ కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం, వంశీ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పూర్తి అయినట్లు ఎక్స్ వేదికగా తెలిపాడు. ఈ విషయాన్ని ఒక ఫోటోతో పంచుకున్నాడు వంశీ.  “దేవర” చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తుండగా, జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. రక్ స్టార్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

Leave a comment

error: Content is protected !!